వైరల్: మరోసారి కరోనా అలజడి.. భయంతో ప్రజలు..!

Divya
గడిచిన నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం భయభ్రాంతులకు గురిచేసింది.. ఈ కరోనాలో చాలామంది కుటుంబ సభ్యులను కూడా కోల్పోవడం జరిగింది.. కోట్లాదిమంది బ్రతుకులు కూడా రోడ్డున పడ్డాయి.. ఇప్పుడిప్పుడే అంత సర్దు మునుగుతున్న సమయంలో మరొకసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది... ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలోనే సుమారుగా 25 వేలపైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది.. దేశ ప్రజలందరూ మాస్కులను ధరించాలని ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తోంది. వచ్చే రెండు మూడు వారాలలో తారాస్థాయికి చేరుకోవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేస్తున్నారు.

కేవలం ఒక్క వారం రోజులలోనే సింగపూర్లో సుమారుగా 26 వేలకు పైగా కేసులు నమోదైనట్లుగా అక్కడ ఆరోగ్య మంత్రి శాఖ తెలియజేస్తోంది. అంతకుముందు వారంలో నమోదైన 13,700 మంది కేసులు పోలిస్తే 90% పెరిగాయని సింగపూర్ ఆరోగ్యం మంత్రి శాఖ తెలియజేశారు.. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ తోనే చాలామంది హాస్పిటల్లో చేరారని ప్రతిరోజు వీరి సంఖ్య 200 నుంచి 250కు పెరుగుతూనే ఉందని తెలుపుతోంది. అలాగే హాస్పిటల్ లో కేర్ సెంటర్లలో పెరిగే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉందని తెలుపుతోంది. అందుకే అక్కడ ప్రభుత్వం మొబైల్ సెంటర్లతో పాటు కేర్ హోమ్ ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

గత 12 నెలల కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ వ్యాధి చాలా తీవ్రత పెరిగిపోతోందని దీంతో సింగపూర్ లో ఉన్న వ్యక్తులు అదనంగా మోతాదులలో తీసుకోవాలని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఒక్కసారిగా సింగపూర్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ,అక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులతో మునిగిపోతున్నారు.. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే అక్కడ వైద్య వ్యవస్థ పైన చాలా ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే తాము ఎలాంటి సామాజిక ఆంక్షలు విధించలేదంటూ తెలియజేస్తోంది సింగపూర్ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: