కర్నూలు నగరంలో ప్రతిపక్ష నేత జగన్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్ష చేస్తున్నారు. ఐతే సీరియస్ గా సాగాల్సిన ఈ దీక్ష కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతో కామెడీ అవుతోంది. జలదీక్ష కాస్తా సెల్ఫీ సరదాల దీక్షగా మారుతోంది. ఆయనకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు, ప్రజలు జగను కలవడంతో పాటు ఆయనతో సెల్ఫీలు దిగటానికి పోటీపడుతున్నారు.
అన్నా.. ఓ సెల్ఫీ దిగుతా..
మొదటి రోజే కావడంతో జగన్ కూడా వీరిని కాదనలేకపోయారు. అది చూసిన మరికొందరు జగన్ తో కేవలం సెల్ఫీల దిగటానికి ఎగబడ్డారు. సోమవారం జలదీక్ష వేదిక మొత్తం సెల్ఫీల దీక్షగానే సాగింది. సాయంత్రం నుంచి బాగా పొద్దుపోయే వరకు అలా గడిచిపోయింది.
తమ్మీ.. సెల్ఫీ బాగా వచ్చిందా..