షాకింగ్.. హైదరాబాద్ అమ్మాయిలు.. పెళ్లికి ముందే అన్నీ..!

Chakravarthi Kalyan
హైదరాబాద్ లో మెట్రో కల్చర్ పెరిగిపోతోంది. పబ్ సంస్కృతి అల్ట్రామోడర్న సంస్కృతి విస్తృతమవుతోంది. చివరకు ఇది యువతీ యువకుల వ్యక్తిగత జీవితాలపైనా విపరీతమైన ప్రభావం చూపుతోంది.. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉంటారని ఇప్పటికే టాక్ ఉంది. హైదరాబాద్ వంటి సిటీల్లో ఇది ఊహించిందే అయినా.. ఆ స్పీడ్ కల్చర్ బ్రేకుల్లేని స్పీడ్ తో దూసుకెళ్తోందట. 

తాజాగా ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన సెక్స్ సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నింటికంటే షాక్ ఇచ్చేది. హైదరాబాద్ యువతులు 67 శాతం మందికి పెళ్లి వరకూ కన్యలుగా ఉండటం లేదట.  అంతకుముందే ఎక్కడో ఒక చోట కాలు జారుతున్నారట. 

పెళ్లి వరకూ ఎవరు ఆగుతారు బాబూ.. 


అంతేకాదు.. ఆఫీసుల్లో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు తమ అందాలను ఎరగా కూడా వేసేందుకు 34 శాతం మంది అమ్మాయిలు అడ్డు చెప్పడం లేదట. కేరీర్ లో ఫాస్ట్ గా ఎదగాలంటే ఆ మాత్రం డేర్ చేయడంలో తప్పులేదన్న ఫీలింగ్ వీరిలో కనిపిస్తోంది. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఉన్నా.. ఇది జాతీయ స్థాయిలో కేవలం 16 శాతం మాత్రమే ఉందట. 

అందుకే గతంలో ఎవరితో ఎన్ని షికార్లు కొట్టినా.. అబ్బాయిలు కాస్త చొరవ చూపితే.. అమ్మా.. అవన్నీ పెళ్లయ్యాకే.. అనే అమ్మాయిల శాతం క్రమంగా తగ్గిపోతున్నదన్నమాట. మారుతున్న కాలానికి ఇదో చిహ్నంగా భావించాల్సి ఉంటుందేమో. అయినా అబ్బాయిలకు లేని శీలం సూత్రం అమ్మాయిలకు మాత్రమే ఎందుకని వాదించేవారూ లేకపోలేదు. వారి మాటా నిజమే కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: