ఫోన్ మాట్లాడుతూ అది గమనించలేదు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
నేటి జనరేషన్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆహారం తీసుకోవడం నీరు తాగడం ఊపిరి పీల్చుకోవడం ఎలా అయితే ప్రతిరోజు మనిషి చేస్తూ ఉన్నాడో.. ఇక మొబైల్ వాడటం కూడా అలాగే భాగంగా మార్చుకున్నాడు అని చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా మొబైల్ అరచేతిలో ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం అదునాతన టెక్నాలజీతో ఎన్నో రకాల ఫీచర్లు అటు మొబైల్ లో అందుబాటులో ఉండడంతో.. బయట ప్రపంచంతో అవసరమే లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ని పరిమితికి మించి కాస్త అతిగానే వాడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా అతిగా మొబైల్ వాడటం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొన్ని కొన్ని సార్లు ఈ మొబైల్ కారణంగా చివరికి ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతోమంది మొబైల్ వాడుతూ రోడ్డుపై వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల గమనించకుండా రోడ్డు ప్రమాదల బారిన పడుతున్నారు. ఇంకొంతమంది రైల్వే ట్రాక్ పై నడుస్తూ చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

 అయితే ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. తల్లితో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాలుడు ఇంటి పైనుంచి కింద పడి మృతి చెందాడు. ఫోన్ మాట్లాడుతూ తాను ఎక్కడ నడుస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించకుండా చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హస్మత్ పేటకు చెందిన పదహారేళ్ల రవీంద్ర భవనం పైకి ఎక్కి తల్లితో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఇంటి పైనుంచి కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: