ఈసారి 2026 టోటల్ మనదే..మార్కెట్ ని ఊరిస్తున్న స్టార్ హీరోలు..అన్నీ పాన్ ఇండియా సినిమాలే..!
అందులో ముఖ్యంగా సంవత్సరం ఆరంభంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ‘రాజా సాబ్’ సినిమాతో రంగప్రవేశం చేయబోతున్నారు. ఈ సినిమా ద్వారా మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నారని ట్రేడ్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇక అక్కడితో ఆగకుండా, ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్‌తో మళ్లీ అదే ఏడాదిలో థియేటర్లలో సందడి చేయబోతుండటం విశేషం. అంటే 2026లో ప్రభాస్ డబుల్ ఎటాక్ ఖాయమనే చెప్పాలి.మార్చి నెలలో అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భారీ సినిమా "పెద్ది"తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్‌లో హైప్ ఏర్పడింది. చరణ్ మార్కెట్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటిన నేపథ్యంలో, ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కూడా 2026లోనే రిలీజ్ కానుండటం మరో హైలైట్. ఈ కాంబోపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మాస్, ఎమోషన్, యాక్షన్ అన్నీ కలిపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.అదే విధంగా, నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభు’ సినిమా కూడా 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కూడా కంటెంట్ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇంకా చెప్పుకుంటే,
*నాగచైతన్య నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ "వృష కర్మ"
*చిరంజీవి ‘విశ్వంభర’
*విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’
*నాని నటిస్తున్న ‘దీ పారడైజ్’
ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమాలు 2026లో థియేటర్లలోకి రాబోతున్నాయి.ఒక్కటంటే ఒక్కటి కాదు… దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్టార్ హీరోల సినిమాలూ అదే ఏడాదిలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.పనిలో పని, ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న రష్మిక మందన్న, సమంత వంటి టాప్ హీరోయిన్ల సినిమాలు కూడా అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీరి మార్కెట్ కూడా సినిమాలపై అదనపు హైప్‌ను తీసుకువస్తోంది.
ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే,2026 సంవత్సరం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేతుల్లోనే ఉండబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.స్టార్ హీరోల మార్కెట్, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా స్థాయి ప్రమోషన్లు… ఇవన్నీ కలసి తెలుగు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.మొత్తానికి,2026 = తెలుగు సినిమా సునామీ అని ఇప్పుడే సినీ అభిమానులు నమ్మకంగా చెప్పేస్తున్నారు.