తెలంగాణ లోక్ సభ బరిలో 525 మంది.. మరి ఇంత పోటీ ఏంటో?
మొత్తంగా 17 లోక్సభ స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక 17 స్థానాలలో పోటీకి 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఎవరు అన్న విషయం ఖరారు అయిపోయింది. కాగా ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరగగా నిన్నటితో నామినేషన్లు ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. అయితే ఎక్కువగా మల్కాజ్గిరిలో 15 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్ లో ఒకే ఒక అభ్యర్థి మాత్రమే పోటీ నుంచి వైదొలిగారు.
అయితే గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఇక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కాస్త ఎక్కువగానే పెరిగింది. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 525 మధ్య అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈ దఫా ఎనిమిది వందల తొంబై మూడు మంది నామినేషన్ దాఖలు చేసారు. గడిచిన ఎన్నికలలో 142 మంది నామినేషన్లు రిజెక్ట్ అయితే ఈ దఫా 268 మందికి పైగా నామినేషన్లు తీరస్కారానికి గురయ్యాయి. గతంలో 60 మంది ఉపసంహరించుకుంటే ఈసారి 100 మంది ఉపసంహరించుకున్నారు. గతంలో 443 మంది తుది పోరులో ఉంటే ఈ దఫా 525 మందికి పెరిగారు.