కేసీఆర్ బాబు పేరు పలికితే.. చప్పట్లే చప్పట్లు..

Chakravarthi Kalyan
కాస్త ఆలస్యంగానైనా ఇద్దరు చంద్రులు మరోసారి కలుసుకున్నారు. మొన్నటి బేగంపేట ఎయిర్ షోలే వీరు కలుసుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు రాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్సైంది. ఇప్పుడు హైదరాబాద్ మరియట్ హోటల్ లో నిర్వహిస్తున్న న్యాయాధికారుల సదస్సుకు ఇద్దరు చంద్రలూ హాజరయ్యారు. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోస్లే ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ముందుగా మాట్లాడిన చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానాన్నివాడుకుని సత్వర న్యాయం అందించే ప్రయత్నం చేయాలని కోరారు. కొత్త రాజధాని అమరావతిలో  అధునాతన హైకోర్టును నిర్మించనున్నట్లు ప్రకటించారు. అంతవరకూ సాధారణంగా సాగిపోయిన సభ కేసీఆర్ ప్రసంగంతో ఆసక్తికరంగా మారింది. 

మొదటే మాట్లాడిన చంద్రబాబు వేదికపైనున్న పెద్దలతోపాటు కేసీఆర్ పేరు చదివినా కనిపించని స్పందన.. కేసీఆర్ నోట చంద్రబాబు పేరు వచ్చినప్పుడు మాత్రం కనిపించింది. సభలో చప్పట్లు ఒక్కసారిగా మోగాయి. దేశ పురోభివృద్ధిలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమన్న ఆయన.. సత్వర న్యాయం కోసం ప్రయత్నించాలన్నారు. గతంలో ఓ సామెత ఉందని.. కేసు ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడని.. అలాంటి పరిస్థితి మారాలన్నారు. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. తెలుగు నేలపై తెలుగులో మాట్లాడుకుందామంటూ ప్రసంగం తెలుగులో ప్రారంభించారు.  న్యాయసేవ సమాజ సేవ లాంటిదన్న ఆయన న్యాయానికి ధనిక, పేద బేధం ఉండదన్నారు. మాతృభాష, మాతృభూమిని ఎప్పటికీ మరువకూడదన్నారు. ఎన్వీ రమణ ప్రసంగం స్ఫూర్తిదాయకంగానూ, ఆసక్తిదాయకంగానూ సాగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: