తెలంగాణ శాసన మండలి సమావేశం..!

shami
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. అయితే శుక్రవారం శాసనమండలి సమావేశం మొదలుపెట్టి అనంతరం పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతికి మండలిలో సంతాపం తెలిపి సభను వాయిదా వేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. తెలంగాణ సభాపతి మధుసూదనాచారి నేతృత్వంలో జరుగనున్న ఈ శాసనమండలి సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే విషయాల మీద సభను నడిపించాలన్న విషయాల మీద నిర్ణయం తీసుకోనున్నారు.   


అంతేకాదు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్న ఈ తరుణంలో తీర్మానాల గురించి కూడా స్పష్టత ఏర్పడటం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుంది. సభ వాయిదా తర్వాత బిఏసి సమవేశం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో పాటుగా శాసనసభ వ్యవహారాల శాఖ మత్రి టి. హరీశ్ రావు, కాంగ్రెస్ తరపున జానారెడ్డి, ఎం.ఐ.ఎం తరపున అక్బరుద్దిన్ ఓవైసి, టి.టిడిపి తరపున రేవన్ రెడ్డి, సిపిఎం, సిపిఐ తరపున సున్నం రాజయ్య, రవిందర్ నాయక్ పాల్గొననున్నారు.  


బిఏసి సమావేశంలో ఆదివారం కూడా శాసన సభను నడిపించేలా చూడాలని, ఇక సోమవారం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల కోసమే పెడుతున్న ఈ సభను మొత్తం 16 రోజులు నడిపించాలని నిర్ణయిస్తారు. మార్చ్ 30 నాటికల్ల ఈ బడ్జెట్ సమావేశాలు ముగించాలని తీర్మానంలో పేర్కొనబోతున్నారట.


ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నా తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపించేందుకు రిలీజ్ చేసే బడ్జెట్ ప్రజల నుండి ఏ విధమైన స్పందన కలుగుతుందో చూడాలి. అన్ని రంగాల వారు తెలంగాణ బడ్జెట్ సమావేశాల మీద ఆశతో ఉన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మార్చ్ 14న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ మీదే అందరి చూపు ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: