పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలుస్తారా ?
కానీ ఎన్నికలకు ముందు తాను ప్రచారం చేసిన ప్రతి సభ మరియు మీటింగ్ లకు జనాలు కోకొల్లలుగా వచ్చారు. అయితే ఈ జనాన్ని చూసిన పవన్ కళ్యాణ్ గెలుస్తాను అని అనుకున్నా.. ఫలితాలు వెలువడ్డాక ఖంగు తినక తప్పలేదు. అప్పటి నుండి అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడానికి గత మూడున్నరేళ్లుగా శ్రమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకా తనకు ఫ్యాన్స్ పై పూర్తి నమ్మకం వచ్చినట్లు లేదు. పవన్ స్వయంగా చాలా మీటింగ్ లలో అన్నాడు మీరు మీటింగ్ లకు వస్తారు... పవన్ పవన్ అంటూ జేజేలు పలుకుతారు. కానీ ఓట్లు మాత్రం వేయడం లేదు అని బాధపడ్డారు .
అయితే ఈ సారి భారీ ప్రణాళికతో ఎన్నికలకు వెళ్తున్న పవన్ ఫ్యాన్స్ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకుంటారా ? పవన్ ఆవేదనను ఫ్యాన్ అర్ధం చేసుకుని ఓట్లు వేస్తారా ? పవన్ ను సీఎం వరకు కాకపోయినా కనీసం ఎమ్మెల్యేను అయినా చేస్తారా అన్నది తెలియాలంటే మరో ఒకటిన్నర సంవత్సరం ఆగాల్సిందే.