వావ్‌.. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే దీనికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి ఈ ఆఫర్ ఇచ్చారని భావించొచ్చు. తెలంగాణలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదిక తెలిపిందని.. కానీ కేసీఆర్ కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

అయితే... కేసీఆర్ 80వేల ఉద్యోగాల ప్రకటన చేశాక.. యువత పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. ప్రిపరేషన్‌లో బిజీ అవుతున్నారు. యూత్‌లో కేసీఆర్ పట్ల ఈ ఉద్యోగాల ప్రకటన సానుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు యువతను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ఉద్యోగాల ప్రకటన చేసినట్టు భావించొచ్చు. ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం యువతను ఆకట్టుకోవచ్చు. అయితే.. నేతల ప్రకటనలు ఉద్యోగాల విషయంలో యువత నమ్మే పరిస్థితి కూడా తగ్గిపోతోంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ‘మన ఊరు.. మన పోరు’ బహిరంగ సభలో నిన్న రేవంత్ రెడ్డి ఈ 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేశారు. అక్కడే ఆయన కేసీఆర్ సర్కారుపై మరిన్ని ఆరోపణలు చేశారు. తెలంగాణ జనం మరో ఏడాది ఓపిక పట్టాలని.. డిసెంబరులో కేసీఆర్‌ ప్రభుత్వం రద్దయి మార్చిలో ఎన్నికలొస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరో  ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు - రంగారెడ్డి సహా అనేక ప్రాజెక్టులను, ఎస్‌ఎల్‌బీసీలో అసంపూర్తిగా ఉన్న 10 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులను పూర్తి చేసేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేసీఆర్ బీసీ వ్యతిరేకి అన్న రేవంత్ రెడ్డి.. వాల్మీకీ బోయలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఇవ్వలేదని... ఒక్క ముదిరాజ్‌ నాయకుడు ఈటల ఎదిగితేనే ఓర్వలేక పదవి ఊడగొట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: