ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థుల తరలింపు.. ఆ వీడియో చూసి ఫైర్ అయిన కేటీఆర్?

praveen
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే రష్యా ఎడతెరిపి లేకుండా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది.  ఉక్రెయిన్ లో ఉన్న అన్ని నగరాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ముందుకు సాగుతోంది రష్యా.  ఇలాంటి సమయంలోనే అటు ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారత విద్యార్థులందరినీ కూడా స్వదేశానికి రప్పించడానికి అటు మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక విమానాలలో ఎంతోమంది విద్యార్థులను భారత పౌరులను కూడా స్వదేశానికి తీసుకు వస్తుంది.

 దీనికి సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇదే విషయంపై స్పందించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించే సమయంలో మోడీ ప్రభుత్వం పిఆర్ ఎక్ససైజ్ గా వ్యవహరించిందని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ దయ వల్లే ప్రాణాలు రక్షించబడ్డాయ్ అని ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి చెబుతున్న వీడియో ని పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

 ఇటీవల ఢిల్లీ సమీపంలోని  ఎయిర్పోర్టులో ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత కేంద్ర సహాయ మంత్రి అజయ్ బట్ విమానంలో తరలించిన పౌరులతో సంభాషించారు. ఈ వీడియోలో చూసుకుంటే మోడీ జిందాబాద్ అని నినాదాలు చేశారు విద్యార్థులు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పాలనను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు చేపడుతుంది మోడీ ప్రభుత్వం. కేవలం మూడు రోజుల్లోనే భారత్కు తిరిగి వచ్చారు. ఇక ఇదంతా మోడీ వల్లే సాధ్యమైంది అంటూ కేంద్ర సహాయ మంత్రి  వీడియోలో చెబుతూ ఉండటం గమనార్హం. ఇక దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: