అసెంబ్లీ ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏమన్నారో తెలుసా?

praveen
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటన కాస్త ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిందన్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కూడా తెర మీదకు తీసుకువచ్చి వారి పై వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం సంచలనంగా మారింది.  అయితే ఏకంగా తన భార్య పేరును కూడా ప్రస్తావిస్తూ ఏకంగా క్యారెక్టర్ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎంతో బాధపడ్డారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా కంటతడి  పెట్టుకోవడం కూడా హాట్ టాపిక్గా  మారిపోయింది.

 ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ లో అడుగు పెడ తాను అంటూ శపథం చేసి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు  ఇక బయట మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా తన భార్యను తిట్టడం పై స్పందిస్తూ బోరున విలపించారు. ఇక ఈ ఘటన ఎంతో మందిని కలిచి వేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టిడిపి నేతలు అందరూ కూడా వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా వ్యక్తిగత దూషణ చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు భార్య పై వ్యక్తిగత దూషణ చేయడంపై ఇప్పటికే స్పందించిన బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఇక ఇటీవలే నిన్న జరిగిన అసెంబ్లీ ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ వ్యక్తిగత దూషణ మాత్రం అరాచక పాలనకు నాంది పలుకుతుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. స్త్రీల గురించి మాట్లాడటం రాక్షస పాలన అంటూ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఆడ వాళ్లను గౌరవించడం మన సంస్కృతి అంటూ తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. తాను ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని దేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను అంటూ తెలిపారు. ఈ అరాచక సంస్కృతిని ఆపి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అంటూ తెలిపారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: