ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

praveen
ప్రస్తుతం రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ కాలుష్యం  పెరిగిపోవడం కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. మారిపోతున్న జీవనశైలి జనాభా పెరిగిపోతుండటం నేపథ్యంలో ప్రతి దేశంలో కూడా అటు పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అడవులను నరికి వేస్తూ అడవులపై భవనాలు నిర్మిస్తుండటం తో అడవుల మనుగడ కాస్త ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో అధిక  అడవులు తగ్గిపోయి పర్యావరణ కాలుష్యం ఏర్పడి జీవకోటికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి మానవ మనుగడను రక్షించాలంటూ ప్రపంచ దేశాలు ఒక తాటి పైకి వైపు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.

 ప్రపంచ దేశాలు అన్ని కూడా ఒక తాటిపైకి వచ్చి పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటానికి ప్రస్తుతం ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు కాలుష్య నివారణ పై ఎంతో సీరియస్గానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ కలిసి  కాలుష్య నివారణ కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరిపేందుకు ఇటీవలే కాప్ 20 పేరుతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి చైనా, రష్యా లాంటి దేశాలు డుమ్మా కొట్టడం గమనార్హం. అయితే చైనాలో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఉండడం అంతే కాకుండా 80 శాతం కరెంటు బొగ్గు నుండే ఉత్పత్తి చేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అటు రష్యా లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటోంది.

 పర్యావరణ కాలుష్యానికి ఎక్కువగా కారకాలుగా మారుతున్న రెండు దేశాలు కాలుష్య నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొనకపోవడం పై ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికా మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నివారణ పట్ల చైనా రష్యా దేశాలకు చిత్తశుద్ధి లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా. కాలుష్య నివారణలో ప్రతి దేశం పాలు పంచుకోవాలి కానీ  ప్రపంచం ఒక వైపు వెళ్తుంటే.. ఈ రెండు దేశాలు మాత్రం మరో విధంగా లబ్ధి పొందాలి అని ప్రపంచం నుంచి వేరు పడటం సరి  కాదు అంటూ అమెరికా స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: