ఐఎస్ఐను రంగంలోకి దించిన పాక్.. లిస్టు లో 200 మంది..?

MOHAN BABU
జమ్మూకాశ్మీర్ లో దాడులు చేయడానికి పాకిస్తాన్ మరో కుట్రకు తెర లేపింది. దీని కోసం ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ ను రంగంలోకి దింపింది. కాశ్మీర్ లో 1990 నాటి పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. ఉగ్రవాదులందరినీ పోగేసి కాశ్మీరీ పండిట్ లపై ఉసిగొల్పుతుంది. ఇంతకీ ఐఎస్ఐ అసలు ప్లాన్ ఏంటి? టెర్రరిస్టుల హిట్ లిస్ట్  లో ఎంత మంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఉగ్ర సంస్థల నాయకులతో ఐఎస్ఐ చర్చలు. టెర్రరిస్టుల హిట్ లిస్టులో రెండువందల మంది కాశ్మీరీలు ఉన్నారు. భారత్ ను ఏదో విధంగా ఇబ్బందికి గురి చేయడమే పాకిస్తాన్ పని. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ను మళ్లీ  పాకిస్తాన్ టార్గెట్ చేసింది.

అక్కడ ఉద్రిక్తతలు సృష్టించేందుకు  పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ లో ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థల  నాయకులతో  సమావేశమై కశ్మీర్లో దాడులకు స్కెచ్  వేసింది. ఈ సమావేశం గత నెల 21న జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారత నిఘా వర్గాలకు పక్కా సమాచారం  అందింది. కాశ్మీర్లో అలజడులు సృష్టించి పెద్ద ఎత్తున దాడి చేయాలని ఉగ్రవాదులకు ఐ ఎస్ ఐ సూచించినట్లు తెలుస్తోంది . దీంతో భద్రతా దళాలు, నిఘా విభాగాలతో పనిచేసే కాశ్మీరీ లను చంపాలని చూస్తున్నారు. అంతే కాదు బిజెపి,ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు మొత్తం 200 మందితో కూడిన హిట్ లిస్టు ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ జాబితాలో ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే  మీడియా ఏజెన్సీ సిబ్బంది, భారతీయ ఏజెన్సీలు, భద్రతా దళాలు, ఇన్ఫార్మర్ లు, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ లు ఉన్నారు. పండిట్ లు కాశ్మీర్ కి తిరిగి వస్తున్న సమయంలో వారిని రాకుండా అడ్డుకునేందుకు ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు.

 దీని కోసం ఎక్కువగా కాశ్మీర్లోని స్లీపర్ సెల్స్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్  కు చెందిన ఉగ్రవాదులను వినియోగించుకుంటున్నారు. ఉగ్రవాద  సానుభూతిపరులు తోనే దాడులు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. కాశ్మీర్ ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐఎస్ఐ ని రంగంలోకి దింపాడు. అసలు ఉగ్రవాదుల లిస్టులో ఉన్న ఆ రెండు వందల మంది ఎవరు అనేదానిపై భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో కాశ్మీర్ లో మరింత భద్రత పెంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: