రేవంత్ కు సపోర్ట్.. ఆ నేతలకు రాహుల్ షాకిచ్చారా..?

MOHAN BABU
 కాంగ్రెస్ పార్టీ  ఇది భారత దేశం రాజకీయ పాలనలో సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ  భారతదేశంలో  అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దేశంలో పట్టుకోసం తీవ్రమైన ప్రయత్నాలు కూడా చేస్తోంది. అది ఈ పార్టీకి సంబంధించిన నేతలంతా చాలా సీనియర్ నాయకులు. దీనివల్ల ఎక్కువగా అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రాజకీయమంతా  అధిష్టానానికి తీవ్రమైన తలనొప్పిగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం ఇలా ఈ తతంగమంతా కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీతో జరిగినటువంటి సమావేశంలోనూ కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదే రకంగా వ్యవహరించారని, తెలుస్తోంది. టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు  రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ  చాలాసేపు వీరి సమస్యలపై మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ లో  కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఇంతసేపు సమావేశం ఏర్పరచడం ఇదే మొదటిసారి.

దీంతో రాహుల్ గాంధీ తో అన్ని విషయాలపై చర్చించాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ విధంగా చర్యలు చేపడుతున్నామో రాహుల్ గాంధీకీ వివరిస్తే, మరికొందరు నేతలైతే కొత్త టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చిస్తారని, కానీ కొత్త నాయకులు వచ్చిన తర్వాత ఇది జరగడం లేదని కొందరు నేతలు పరోక్షంగా రాహుల్ గాంధీ తో చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తిస్థాయిలో నివేదిక తెప్పించు కున్నటువంటి రాహుల్ గాంధీ, ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాలు నిజమా కాదా అని రాహుల్ పూర్తిగా అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ కొద్దికొద్దిగా బలపడుతుందని, ఈ సమయంలో  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం  మంచిది కాదని, తనతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన నేతలతో  ఆయన అన్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి  విషయంలో  కొంతమంది నేతలు చేసేటటువంటి ఆరోపణలని రాహుల్ గాంధీ పట్టించుకోవడంలేదని  సమాచారం. తెలంగాణలో టి పి సి సి  రేవంత్ రెడ్డి వచ్చాక  కాంగ్రెస్ లో చాలా మార్పు వచ్చిందని  దీన్ని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది అని రేవంత్ రెడ్డికి పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారని  సమాచారం. అందుకే రేవంత్ రెడ్డి పై వచ్చే ఫిర్యాదులను రాహుల్ గాంధీ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణ నాయకత్వం భేటీ తర్వాత  రేవంత్ రెడ్డికి మరింత సపోర్టు లభించిందని రేవంత్ రెడ్డి ఇంకా జోష్ పెంచారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: