షర్మిల పార్టీలోకి కోమటిరెడ్డి.. ఇది నిజమేనా?

praveen
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నాటినుండి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే పీసీసీ పదవి ఆశించారు వెంకట్ రెడ్డి. కానీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వెంకట్ రెడ్డి ని కాదని కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఏకంగా  కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం సంచలనంగా మారింది.  ఈ క్రమంలోనే బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.  కానీ ఆ తర్వాత మాత్రం పార్టీతో కలిసి నడుస్తాను అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

 ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశం కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అటు ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇక తెలంగాణలో షర్మిల పార్టీ నేతలు కూడా హాజరైయ్యారు. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనం కి తెలంగాణ కాంగ్రెస్ లో  కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి  హాజరు కావడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పార్టీ అనుమతి లేకుండా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా  సమ్మేళనానికి హాజరవుతారు అంటూ ప్రస్తుతం పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.


 ఈ ఆత్మీయ సమ్మేళనం కి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవ్వడం పై మధుయాష్కిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు. పార్టీ నిర్ణయం కాదని ఆత్మీయ సమ్మేళనం కి వెళ్లడం పార్టీ వ్యతిరేక కార్యకలాపమే అవుతుంది అంటూ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పార్టీలో కి వెళ్ళాలి అనుకుంటే  నిర్మొహమాటంగా వెళ్లొచ్చు అంటూ మధుయాష్కి చెప్పుకొచ్చాడు. కానీ పార్టీలో ఉంటూ ఏకంగా పార్టీకి వెన్నుపోటు పొడవద్దు అంటూ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

 అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజంగానే షర్మిల పార్టీలోకి వెళ్ళబోతున్నారా అన్న ప్రచారం కూడా ప్రస్తుతం మొదలయింది. ఓవైపు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండటం జీర్ణించుకోలేకపోతున్న కోమటిరెడ్డి.. మరోవైపు ఇలా షర్మిల పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కి హాజరవడం చూస్తుంటే ఇక కోమటిరెడ్డి షర్మిల పార్టీ లోకి వెళ్లడం ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: