"భారత సంతతి"....శాస్త్రవేత్తకి అరుదైన గౌరవం..!!!

NCR

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయ నిపుణుల ప్రతిభకి ఎప్పటికప్పుడు అక్కడి ప్రభుత్వం పట్టం కడుతూనే ఉంటుంది. ఎంతో మంది ఇండో అమెరికన్స్ ని అమెరికా కీలక శాఖల్లో నియమించి ప్రతిభకి తగ్గ గుర్తింపు ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇండో అమెరికన్ శాస్త్రవేత్తకి అరుదైన గుర్తింపు ఇచ్చింది అమెరికా.


జీవ శాస్త్రవేత్తగా, ప్రొఫెసర్ గా అంతకంటే ముఖ్యంగా సామాజిక ఉద్యమ కారుడిగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ ఇండో అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనాథ్‌కు ప్రఖ్యాత క్లీవ్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా గౌరవం లభించింది. ఎన్నో రంగాలలో సేవలు చేసినందుకు గాను ఈ గౌరవానికి ఆయన్ని ఎంపిక చేశారు.

 

కేస్‌ వెస్టర్స్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలో ఎంతో కాలంగా ప్రొఫెసర్ గా  పని చేస్తున్న ఆయన ,సేవా ఇంటర్నేషనల్‌ సంస్థకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం లో బీఈ , ఐఐఎస్‌సీ ,ఎంఈ పూర్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: