2017 లో భారతీయుల..."గ్రీన్ కార్డ్" లెక్కలు..!!!

NCR

అమెరికాలో శాశ్వత నివాసం పొందటానికి విదేశీయులు ఎంతో ఆరాటపడుతుంటారు..అందుకుగాను అమెరికా నిభంధనలకి అనుగుణంగా నడుచుకుంటూ పౌరసత్వం కోసం వేచి చూస్తుంటారు..ఇప్పటి వరకూ అమెరికాలో దాదాపు ఆరు లక్షల మంది భారతీయులు  గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తుంటే గత సంవత్సరం  కేవలం 60వేల మందికి మాత్రమే గ్రీన్ కార్డులు  మంజూరయ్యాయి. ఈ మేరకు దీనికి సంబంధించిన నివేదికను డీహెచ్‌ఎస్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ) విడుదల చేసింది.

 

అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా గ్రీన్‌ కార్డు కోసం భారతీయులు కనీసం 25 సంవత్సరాల నుంచి 95ఏళ్ల పాటు వేచి చూడాల్సి వస్తోంది...2018 ఏప్రిల్‌ లెక్కల ప్రకారం చూస్తే  దాదాపు 6,32,219 మంది భారతీయ వలసదారుల కుటుంబస పిల్లలు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు...వీరిలో 2017 ఏడాదికి గాను 60,394 మంది భారతీయులు గ్రీన్‌కార్డును పొందగలిగారు. వారిలో హెచ్‌ 1బీ వీసాపై ప్రతిభ ఆధారంగా ఉద్యోగులు చేస్తున్న 23,569 మంది ఉన్నారు.

 

ఇదిలాఉంటే గత రెండేళ్లతో పోల్చుకుంటే క్రితం ఏడాది గ్రీన్‌కార్డు పొందిన భారతీయుల సంఖ్య బాగా తగ్గింది. ఇక దేశాల వారీగా జాబితాను పరిశీలిస్తే గ్రీన్‌కార్డులు పొందిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా సుమారు 71,565 మంది చైనీయులు యూఎస్‌లో శాశ్వత నివాసాన్ని పొందారు.,..ఆ తరువాతి స్థానంలో క్యూబా - 65,028  , భారత్‌ - 60,394 నిలిచాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: