భారత్ నుంచే ఎక్కువ విసాలు వచ్చాయట..!

Edari Rama Krishna
గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలంటే  విదేశాలను ఆశ్రయిస్తున్నారు విద్యార్థులు.  ఆ విద్య పూర్తయిన తర్వాత అక్కడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు.  ఎక్కువ శాతం భారతీయులు అమెరికాలో విద్య అభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతుంటారు.  అలా ఇష్టపడటం వల్ల అక్కడి వీసాలకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌సీఐఎస్‌ అధికారిక నివేదిక వెల్లడించింది.  

ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక హెచ్‌-1బి వీసాల అంశంపై తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత 11 ఏళ్లలో సుమారు 21 లక్షలకు పైగా భారత్‌కు చెందిన ఐటీ ఉద్యోగులు హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.

అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది అర్హతలు లేకపోవడంతో వాటిని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ (యూఎస్‌సీఐఎస్‌) తిరస్కరించిందని నివేదిక సృష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: