యుద్ధంలో అంత మంది చనిపోయారా.. ఇన్నాళ్లకు నిజం బయటపెట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు?

frame యుద్ధంలో అంత మంది చనిపోయారా.. ఇన్నాళ్లకు నిజం బయటపెట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు?

praveen
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక మారణహోమంలా మారిపోయింది. ఎన్ని ప్రాణాలు పోతున్న రెండు దేశాల అధ్యక్షులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరి పెరిగి పెద్దదవుతుంది. కానీ తగ్గడం లేదు. అయితే ఈ రెండు దేశాలు మధ్య శాంతియుత చర్చలు జరిపి సయోధ్య కుదిరించేందుకు ఎన్ని దేశాల అధ్యక్షులు ప్రయత్నించిన అది ఒక కొలిక్కి రావడం లేదు.

 నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతుండగా అందుకు అంగీకరించని రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. ఇలా మొదలైన యుద్ధం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. కేవలం సైనికులు మాత్రమే కాదు సామాన్య పౌరులకు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాలి. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి బాంబు మీద పడిపోతుందో అనేది అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు ఇరుదేశాల ప్రజలు. అయితే ప్రజలు ఇలా యుద్ధ వాతావరణంతో అల్లాడిపోతున్నప్పటికీ ఇరుదేశాల అధ్యక్షులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇలా రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారు అనే విషయం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలన్ స్కి షాకింగ్ విషయాన్ని చెప్పారు. రష్యాతో జరిగిన యుద్ధంలో 43,000 మంది ఉక్రెయిన్ సైనికులను కోల్పోయాము అంటూ ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కి ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న యుద్ధంలో మరో 3.70 లక్షల మంది గాయపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రష్యా  1. 98 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల అగ్రరాజ్య అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ ఏకంగా ఇరుదేశాల మధ్యకాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: