మిత్రభేదం: పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా?
చైనా తన పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చి మరీ నిధులు కేటాయిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో.. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవు. దీనికి తోడు ఆ దేశానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు. కారిడార్ పనులు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. దీంతో చేసేదేమి లేక మిగతా పనులను పూర్తి చేసి దానిపై హక్కులను కూడా తీసుకోమని చైనాను పాకిస్థాన్ కోరింది.
ఓ పాకిస్థాన్ లో కారిడార్ ని పూర్తి చేస్తుంటే అక్కడి వాళ్లు చైనా వాళ్లనే చంపుతున్నారు. దీనిపై పాక్ స్తబ్ధుగా ఉండటాన్ని చైనా సహించలేకపోతుంది. ఈ విషయంపై పాక్ ను ప్రశ్నించింది. ఈ విషయంలో ఆ దేశానికి బలమైన వార్నింగ్ ఇచ్చింది. ఈ కారిడార్ పై పదే పదే ప్రస్తావించొద్దు. ముందు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత ఈ విధాన పరమైన నిర్ణయం తీసుకోవచ్చు. అనవసర విధానాలు సృష్టించొద్దు అని పేర్కొంది.
బెలూచిస్తాన్ లో ఉన్న వనరులను దోచుకునే క్రమంలో అక్కడి జీహాదీలు చైనా వారిపై కూడా దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో కొత్త పెట్టుబడులు లేదా అదనపు వాటిని పెట్టమని చైనా తేల్చి చెప్పింది. ఈ విషయమై పదే పదే అడొగొద్దు అని తెలిపింది.