జర్మనీలో తిరుగుబాటు తప్పదా?

Chakravarthi Kalyan
ఇప్పుడు జర్మనీలోని ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దానికి కారణం జర్మనీ ఉక్రెయిన్ కు యుద్ధంలో తన సహాయాన్ని అందిస్తూ ఉండడమే అని తెలుస్తుంది. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ సారి  అక్కడ ఎలక్షన్స్ పెడితే జర్మనీ ఛాన్సలర్  దిగిపోయే ప్రమాదం ఏర్పడుతుందట. ఇప్పటికే తన దగ్గర ఉన్న ఆయుధాలను చాలావరకు ఉక్రెయిన్ కు  ఇచ్చేసింది జర్మనీ.

చివరికి ఇప్పుడు జర్మనీ పై ఏ దేశమైనా యుద్ధానికి వస్తే వాళ్లకు ఆయుధాల కొరత అనేది ఖచ్చితంగా ఎదురవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు తనతో భీకరంగా పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవాలంటే ఉక్రెయిన్ కు డ్రోన్స్ అవసరం. అయితే ఇప్పటికే శక్తికి మించి సహాయం చేస్తుంది జర్మనీ. జర్మనీ ఉక్రెయిన్ కు సహాయం చేస్తుంది అంటే అది ఇన్ డైరెక్ట్ గా రష్యాపై దాడిని సమర్థిస్తున్నట్లే.

విచిత్రం ఏంటంటే జర్మనీ ఒక వైపు రష్యా పతనానికి ఉక్రెయిన్ కు సహాయం చేస్తుంటే, జర్మనీ ప్రజలు మాత్రం రష్యా మంచి కోరుతున్నారని తెలుస్తుంది. జర్మనీ ఆర్థిక శక్తిగా నిలబడింది అంటే దానికి కారణం రష్యానే అని వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం‌ కారణంగా తాము దెబ్బతిన్నామని వాళ్లు భావిస్తున్నారు.  రష్యాతో పోరాడుతూ ఒక పక్కన దారుణంగా దెబ్బ తింటున్నా కూడా తిరిగి అదే రష్యాను కవ్వించి మరీ కయ్యానికి పిలుస్తూ ఉంటాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు.

తీరా యుద్ధానికి ఎదుటివాడు వచ్చిన తర్వాత నా దగ్గర ఆయుధాలు అయిపోయాయని తర్వాత రమ్మని ఆటలాడుతూ ఉంటాడట ఉక్రెయిన్ అధ్యక్షుడు. మరో పక్క  తనకు యుద్ధంలో సహాయం చేస్తున్న నాటో దేశాలతో శత్రువు నా మీదకి వచ్చేసాడు, బలంగా దాడి చేస్తున్నాడు, నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాడు. శత్రువు నాపై మిస్సైల్స్ విసురుతున్నాడు, బాంబులు వేస్తున్నాడు నాకు డ్రోన్లను అందించండి అంటూ జర్మనీతో పాటు నాటో  దేశాలన్నింటినీ  అర్థిస్తుందట ఉక్రెయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: