శరీరంపై 800 టాటూలు.. కానీ ఇప్పుడు బాధపడుతుంది?
దీంతో ఇలాంటి టాటూ పిచ్చి కారణంగా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ బ్రిటన్ కు చెందిన మహిళకు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యయ్. ఆమెకు టాటూలు అంటే పిచ్చి ఎంతలా అంటే ఇక కేవలం శరీరంలో ఒక్క భాగం మీద మాత్రమే కాదు శరీరం మొత్తం టాటూలు వేయించుకోవాలనే కోరిక ఆమెలో పెరిగిపోయింది. దీంతో ఎవరు ఏమనుకుంటారో అని వెనక ముందు ఆలోచించకుండా టాటూలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భారీగానే ఖర్చు పెట్టి శరీరం మొత్తం కాస్తయినా గ్యాప్ లేకుండా టాటూలు వేసుకుంది సదరు మహిళ. కానీ ఇప్పుడు ఊహించని ఇబ్బందులు ఎదురై బాధపడుతుంది.
బ్రిటన్ కు చెందిన మహిళా తన శరీరమంతా టాటూలతో నింపేసింది. అయితే ఆమెకు టాటూలు అంటే చాలా ఇష్టం. దీంతో 20 ఏళ్ళ నుంచే టాటూలు వేసుకోవడం మొదలుపెట్టింది సదురు మహిళ. అయితే ఇప్పుడు శరీరం మొత్తం 800 టాటూలు ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఈ పచ్చబొట్ల కారణంగానే తనకు ఎవరూ జాబ్ ఇవ్వడం లేదట. చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండడంతో కనీసం టాయిలెట్లు క్లీన్ చేసే జాబ్ కూడా ఇవ్వడం లేదు అంటూ మహిళా వాపోయింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా టాటూలతో నిండిపోయిన ఈ మహిళ శరీరం చూడడానికే భయంకరంగా ఉంది కదా.