ఈజిప్టు పర్యటనతో మోడీ ఏం సాధించారు?

Chakravarthi Kalyan
ఒక పక్కన  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశంలో ముస్లింలను పై భారతీయ జనతా పార్టీ వివక్షత చూపిస్తుందంటూ మోడీని విమర్శించడం జరిగింది. అయితే దీనికి కేంద్ర మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారని తెలుస్తుంది. కేంద్ర మంత్రులైన రాజ్ నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ ఇంకా నిర్మల సీతారామన్ బరాక్ ఒబామాని సూటిగా, స్పష్టంగా ప్రశ్నించారు.

వాళ్లు ఒబామాని ఉద్దేశిస్తూ నువ్వు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆరు ముస్లిం దేశాలపై బాంబులు దాడి చేయించావు.. అలాంటి నువ్వు భారతదేశాన్ని విమర్శించడం ఏమిటని, సుఖంగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టవద్దు అని వాళ్లు హెచ్చరించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒబామా ఏ ముస్లింల గురించి  అయితే భారత్ ని, ఇంకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారో ఆ విమర్శలు నీరు కారిపోతున్నాయని తెలుస్తుంది.

ఎందుకంటే ఒబామా, మోడీ ఏ ముస్లింలపై అయితే వివక్ష చూపిస్తున్నాడు అంటున్నాడో, మరో పక్క అవే ముస్లిం దేశాలు ఇప్పుడు మోడీని గౌరవిస్తున్నాయని తెలుస్తుంది. సరిగ్గా  మోడీపై విమర్శ చేస్తున్న సమయంలోనే మోడీ ఈజిప్ట్ దేశం యొక్క అత్యున్నత గౌరవాన్ని పొందుతున్నట్లుగా తెలుస్తుంది‌. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యక్తులకు ఇచ్చే ఈ గౌరవాన్ని ముస్లిం దేశమైన ఈజిప్టులో మోడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

మనకు భారతరత్న ఎలానో వాళ్ళకి ఆ సత్కారం అలాగా అని తెలుస్తుంది. ఈజిప్టు యొక్క ఈ సత్కారం పేరు ఆర్డర్ ఆఫ్ నైల్. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు, నెల్సన్ మండేలాకు, క్వీన్ ఎలిజిబెత్ 2 కు మాత్రమే ఇప్పటివరకు ఈ సత్కారాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే మోడీ ముస్లింలపై వివక్ష చూపిస్తున్నాడు అన్న ఒబామా 6ముస్లిం దేశాలపై బాంబులు దాడి చేయించాడు. కానీ అవే ఆరు ముస్లిం దేశాలు ఇప్పటి వరకు మోడీని తమ దేశపు అత్యున్నత పురస్కారాలతో  సత్కరించడం ఆయనకు మాత్రమే దక్కిన గౌరవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: