అయ్యబాబోయ్.. అవెంజర్ లా మారిపోయాడు?

praveen
పిచ్చి పది రకాలు అని చెబుతూ ఉంటారు . ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఇక ఎవరి పిచ్చి వారికి ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పిచ్చితో వాళ్ళు చేసే పనులు పక్క వారికి  విచిత్రంగా అనిపించినా వారికి మాత్రం ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో అందరి కంటే భిన్నంగా ఉండాలని భావిస్తున్న ఎంతోమంది చిత్రవిచిత్రమైన ఆలోచనలతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు అని చెప్పాలి. ఏకంగా తమ ముఖాన్ని తమ శరీరాన్ని కూడా మార్చుకోవడానికి సిద్ధమైపోతున్నారు.

 ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసి వార్తల్లో నిలిచాడు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ని చూస్తే ఎవరైనా సరే రక్త పిశాచి కళ్ళ ముందుకు వచ్చి నిలబడింది ఏమో అని ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో అక్కడినుంచి పరుగూ తీస్తారు. అతని పేరు అంతోని లోఫ్రెడో. ఇతను ఫ్రాన్స్ లో ఉంటాడు. అతనికి ఒక వింత కోరిక ఉండేది. తనను తాను పిశాచిగా మార్చుకోవాలని కలలు కనేవాడు. ఈ క్రమంలోనే తన శరీరాన్ని మొత్తం మార్చుకున్నాడు. ఇతను రాత్రులు బయట తిరుగుతూ భయ పెడుతూ ఉంటాడు.

 ఇటీవలి కాలంలో టాటూ అన్నది ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా  ఒకటి లేదా రెండు టాటూలు వేయించుకోవడం చూసాము. కానీ ఇతను మాత్రం  బాడీ మొత్తం టాటూ వేయించుకున్నాడు. ఈ క్రమంలోనే  ఏకంగా ఏలియన్ లాగా మారిపోయాడు అని చెప్పాలి. కొన్నాళ్ళ వరకూ అతని పిచ్చి అతనికి ఆనందాన్ని ఇచ్చిన ఇప్పుడు అతని రూపం కారణంగా ఎక్కడ ఉద్యోగం దొరక్క పడరాని పాట్లు పడుతున్నాడు. కనుబొమ్మల దగ్గర నుంచి శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా టాటూ తో నింపి చివరికి రక్త పిశాచిలా తన శరీరాన్ని మార్చుకున్నాడు. రెండు వేళ్ల్లు ముక్కు చెవులు కూడా కట్ చేయించుకుని సర్జరీ చేయించుకున్నాడు. అతని రూపాన్ని చూసి అందరూ వణికి పోతున్నారు అనే చెప్పాలి. అయితే అవెంజర్ సినిమాల్లో కూడా ఇలాంటి రూపురేఖలతో అందరు కనిపిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: