షాకింగ్ : యజమానిని పీకుతున్న పెంపుడు పిల్లులు?

praveen
ఇటీవల కాలంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక తమకు ఇష్టమైన పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటిపై అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు కేవలం కుక్కలను మాత్రమే పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి తారతమ్యం లేకుండా కుక్కల తో పాటు పిల్లలను సైతం ఎక్కువ మంది తమ పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారూ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా మనుషుల మీద చూపించినట్లు గానే ఆ పెంపుడు జంతువుల పై కూడా అమితమైన ప్రేమను చూపిస్తున్నారు.

 ఇలా పెంపుడు జంతువు యజమానికి మధ్య అనుబంధం ఎలా ఉంది అన్న విషయాన్ని తెలియజేసేందుకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. ఆయా వీడియోలు చూసిన తర్వాత పెంపుడు జంతువులను పెంచుకుంటే ఇంత ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు పెంపుడు జంతువుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే పెంపుడు జంతువులను పెంచుకోవాలని అంటేనే భయపడిపోతారు ఎవరైనా.

 ఓ మహిళ ప్రేమగా కొన్ని పిల్లులను పెంచుకుంది. కానీ ఆ పిల్లలే చివరికి ఆమెను పీక్కుతున్నాయి. ఈ ఘటన రష్యా లోని రోస్టవ్ లో వెలుగులోకి వచ్చింది. దాదాపు 20 పిల్లలను ఓ మహిళ పెంచుకుంటుంది. అయితే రెండు వారాల క్రితం మహిళ ఇంట్లోనే ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. దీంతో పెంపుడు పిల్లలకు తిండి పెట్టే వారు లేకుండా పోయారు. ఆకలితో అలమటించిన ఆ పెంపుడు పిల్లలు చివరికి యజమాని మృతదేహాన్ని పీకుతున్నాయి. మృతురాలి సహోద్యోగి అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పిల్లలు పీక్కు తినగా మృతదేహం లో కొంత భాగం మిగిలి ఉందని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Car

సంబంధిత వార్తలు: