రష్యా వ్యూహం తప్పిందా.. అందుకేనేమో ఇదంతా?

praveen
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ అసలు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు అర్థం కావడం లేదు. యుద్ధం మొదలు పెట్టినప్పటికీ చిన్న దేశమైన ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడి ఏకంగా అగ్ర దేశమైన రష్యా పై చేయి సాధించిందా? రష్యా సైనికులను ఏకంగా పది వేల మందిని మట్టుబెట్టి ఇక తమకు తిరుగులేదు అని ఉక్రెయిన్ నిరూపించిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం అవును అనేస్తున్నారు  ఎవరైనా. ఎందుకంటే అటు రష్యాతో పోల్చిచూస్తే ఉక్రెయిన్ సైన్యం ఎక్కడ సరితూగదు.

 రష్యా ముందు ఉక్రెయిన్ పసికునా లాంటి దేశం. ఇక అలాంటి ఉక్రెయిన్ రష్యా సైనిక చర్య ప్రారంభించింది. మొదట సైనిక స్థావరాలపై దాడులు చేసిన రష్యా ఆ తర్వాత జనావాసాల పై దాడులు చేయడం మొదలుపెట్టింది. యుద్ధ విమానాలు యుద్ధ ట్యాంకులు హెలికాప్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే తమ దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలతో కూడా రష్యా దాడులకు పాల్పడింది. ఇక రష్యా యుద్ధానికి దిగిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడం ఖాయం అని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు కూడా అంచనా వేశారు. ఉక్రెయిన్ సైనికులు ఎంత పోరాడినా రష్యాను నిలువరించడం మాత్రం చాలా కష్టం అని అనుకున్నారు.

 కానీ ఇక ఇప్పుడు మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే చిన్న దేశమైన ఉక్రెయిన్ తక్కువ సైన్యం ఉన్నప్పటికీ తెగింపుతో పోరాటం చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగిన రష్యా తగిన మూల్యం చెల్లించుకుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికీ యుద్ధానికి దిగి నెల రోజులు అవుతుంది. కానీ ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది అగ్ర దేశమైన రష్యా. ఇక ఉక్రెయిన్ రాజధాని నగరమైన కేవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా కదిలినా రష్యా సేనలు  ఇప్పుడు నెమ్మదించాయ్. ఉక్రెయిన్ సైనికుల  నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోన్న నేపథ్యంలో మొదట ఆక్రమించుకున్న ప్రాంతాలను సైతం వదులుకోవాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆహారం మందుగుండు లేకపోవడం కారణంగా ఇక ముందుకు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో రష్యా సైన్యం నిస్తేజంగా మారింది అంటూ ప్రస్తుతం అమెరికా చెబుతూ ఉండటం గమనార్హం. పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: