రష్యా యుద్ధం.. మృతదేహాలను కుక్కల కోసం వదిలేస్తున్నారు?

praveen
రష్యా ఉక్రేయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎక్కడ తగ్గుముఖం పడుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు మాత్రం విఫలం అవుతూనే ఉన్నాయి.  దీంతో రోజు రోజుకు యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది తప్ప యుద్ధం ఇప్పట్లో ఆగేలా మాత్రం కనిపించడం లేదు. అటు రష్యా ఎడతెరపిలేకుండా ఉక్రెయిన్  పై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక తక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అటు ఉక్రెయిన్ కూడా రష్యా సేనలతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఉండటం గమనార్హం.

 ఇక రష్యా సేనల భీకరమైన దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సమయంలోనే ఇక తాము ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తున్న రష్యా సైనికులను వందలమందిని మట్టు పెడుతున్నాము అంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ చెబుతూ ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అన్నది అర్ధమవుతుంది. యుద్ధంలో మరణించిన రష్యన్ సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ సైనికులు అలాగే వదిలేస్తున్నారు అన్న విషయం ఇటీవల బయటపడింది.

 ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరం లో యుద్ధం లో మరణించిన రష్యా సైనికుల మృతదేహాలు మంచుల్లో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక జర్నలిస్టు డెడ్ బాడీ లు ఇలా వదిలేసారు ఏమిటి అని అడుగగా... ఏకంగా రష్యన్ సైనికులు డెడ్ బాడీ లను కుక్కల కోసం వదిసామ్ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ మాతృదేశాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారిపై సింహాల్లా పోరాటం చేస్తున్నామని తమ వారిని తప్పక కాపాడుకుంటాం అంటూ ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు అని తెలుస్తోంది. ఇలా ఏకంగా రష్యన్ సైనికులు మృతదేహాలను కుక్కలు తినేందుకు వదిలేసామని సైనికులు సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: