ఉక్రెయిన్ కు షాక్.. రష్యా కాదు.. మరో దాడి?

praveen
రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలో యుద్ధానికి దిగి పోతుందో అన్నది కూడా తెలియని విధంగా మారిపోయింది. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో చేరేందుకు సిద్ధం అవడమే ఇక రష్యా లాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి కారణం అయింది. అయితే అటు చిన్న దేశమైన ఉక్రెయిన్ కి రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి.



 అయితే రష్యా ఏ క్షణంలోనైనా యుద్ధం చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో సరిహద్దు లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ కు ఊహించని షాక్ తగిలింది.  రష్యా నుంచి కాదు ఏకంగా ఉక్రెయిన్ దేశంలో ఉన్న వేర్పాటువాదులు  సైన్యంపై దాడి చేయడం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తూర్పు ఉక్రెయిన్ లో ఉన్న డొనేస్కీ ప్రాంతంలో ఉక్రెయిన్ ఆర్మీ వేర్పాటువాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.



 దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర స్థాయి  లో ఘర్షణ మొదలైంది అన్నది తెలుస్తుంది. వేర్పాటు వాదుల దాడిలో ఉక్రెయిన్ సైనికుడు మరణించినట్లు తెలుస్తోంది. అయితే రష్యా మద్దతు తోనే ఉక్రెయిన్ లో ఉన్న వేర్పాటువాదులు సైనికుల పై కాల్పులకు  తెగ బడుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమం లోనే ఉక్రెయిన్ దళాలు అప్రమత్త  మయ్యాయ్. మోటార్లు, గ్రేనెడ్ లాంచర్లు,  యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టం లతో వేర్పాటు వాదులను ఎదుర్కొనేందుకు దాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రష్యా సైన్యం దాడి చేసేందుకు దూసుకొస్తున్న సమయంలో వేర్పాటువాదుల దారి అటు ఉక్రెయిన్ కు ఊహించని షాక్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: