ఉక్రెయిన్ తెగించింది.. రష్యా కి షాక్?

praveen
మరి కొన్ని రోజుల్లో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితు లను చూస్తూ ఉంటే మాత్రం ఏమీ చెప్పలేని విధంగా మారి పోయింది.  ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో కలిసేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ పై ఆధి పత్యం సాధించేందుకు సిద్ధమైంది రష్యా. ఈ క్రమం  లోని రష్యా చెప్పు చేతల్లో ఉండేందుకు  సిద్ధంగా లేము అంటూ తేల్చి చెప్పింది  ఉక్రెయిన్. ఇలాంటి సమయం లో చిన్న దేశమైన ఉక్రెయిన్ కు  అగ్ర రాజ్యమైన అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

 దీంతో ఇక ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో నెల కొన్న సమస్యను తీర్చేందుకు ఎన్ని సార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలం అవుతూనే వస్తున్నాయి అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేసింది రష్యా. భారీగా ఆయుధాల ను మోహరించి యుద్ధ విన్యాసాలు చేయడం మొదలు పెట్టింది. ఇలా ఒక వైపు నుంచి రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటే ఉక్రెయిన్ మాత్రం సైలెంట్ గా ఉండి పోయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ కూడా తెగించింది అని అర్థ మవుతుంది.

 మొన్నటి వరకు సరిహద్దు ల్లో సైలెంట్గా ఉన్న ఉక్రెయిన్ ఇక ఎప్పుడు యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా ఒక వైపు రష్యా మరో వైపు ఉక్రెయిన్ యుద్ధ విన్యాసాలు మొదలు పెట్టడం తో సరిహద్దు ల్లో పరిస్థితులు మరింత హాట్ హాట్ గా మారి  పోయాయి. ఈ క్రమం లోనే రానున్న రోజుల్లో ఏం జరగ బోతుంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధం తప్పదు అన్నట్లు గానే ఉంది అంటూ ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: