విదేశాలకు వెళుతున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి... ?

VAMSI
ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా మానవజాతిపై ఎన్నడూ లేనంత ప్రళయాన్ని సృష్టించింది. దీనితో ఒక్కసారిగా మానవుని జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. కొన్ని దేశాల్లో అయితే ఇంకా కరోనా ఉదృతి కొనసాగుతోంది. అందులో ఇండియా కూడా ఒకటి. దీనితో ప్రభుత్వాలు అనేక రకాల భద్రతహా పరమయిన చర్యలను తీసుకుంటున్నారు. ఈ సమయంలో కొంతమందికి ఇబ్బంది కలిగినా దేశ రక్షణ కోసం తప్పడం లేదు. కరోనా ముందు వరకు అయితే ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తే ఒక గంట నాముందు వచ్చిన సరిపోయేది. కానీ ఇప్పుడు కొన్ని నిబంధనలను ఎయిర్పోర్ట్ అథారిటీ తీసుకు వచ్చింది. ఈ నియమ నిబంధనలను పాటిస్తేనే మీరు విదేశాలకు వెళ్ళగలరు. లేదంటే అనవసరంగా టికెట్ అమౌంట్, మీ సమయం జరగాల్సిన పనులు అన్నీవృధా అయిపోతాయి. అయితే ఈ సమస్య ప్రతి దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.
* మీరు మీ టికెట్ము సమయానికి 6 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే కరోనా పిసిఆర్ పరీక్ష చేయనిదే అనుమతించడం లేదు. ఈ పరీక్షకు అక్కడ రూ. 4500 ల వరకు తీసుకుంటున్నారు. ఇది ప్రయాణికుడికి అదనపు భారం అవుతుంది.  
* మీరు ఎప్పటికప్పుడు మీరు వెళ్లాల్సిన దేశాలు అమలు చేస్తున్న కరోనా మరియు వీసా నియమాలను తెలుసుకుంటూ ఉండాలి. తెలియకుండా అక్కడకు వెళ్లి ఇబంది పడడం కన్నా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడడం సబబు.
* ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ అన్ని దేశాలకు అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తించుకుని ముందుగానే టికెట్ లను బుక్ చేసుకోవడం మంచిది.
* అంతే కాకుండా ఒక్క రోజు ముందుగా ఎయిర్పోర్ట్ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి నిబంధనలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని తెలుసుకుని వెళ్లడం ఉపయోగకరం.
*  కరోనా ముందు వరకు ఏమయినా రూల్స్  మారి ఉంటే ఎయిర్లైన్స్ వారు మెసేజ్ ద్వారా తెలియచేసే వారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు కాబట్టి అలెర్ట్ గా ఉండడమే మంచిది.
మరి విదేశాలకు వెళ్లాల్సిన వారు ఈ విషయాలను గుర్తుంచుకోండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI

సంబంధిత వార్తలు: