ఏపీలో సర్వే సంచలనం.. కూటమి జాగ్రత్త పడాల్సిందేనా..?

Divya
ఎన్నికలు సమయం దగ్గర పడే కొద్ది పలు రకాల పేర్లతో సర్వేలు సైతం సంచలనంగా మారుతుంటాయి. మరికొన్ని అధికారం చేపట్టి  ఏడాది ,రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని సర్వేలు సైతం తెలియజేస్తుంటాయి. అలా ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 18 నెలలు అవుతున్న సందర్భంగా ఇటీవలే ఆత్మసాక్షి సర్వే అనే పేరుతో ఒక సర్వే విడుదల చేయగా ఏపీ అంతటా సంచలనంగా మారింది. మూడ్ ఆఫ్ ఏపీ గా ఈ సర్వే చేయించారు.


సుమారుగా 70 రోజులపాటు ఈ సర్వే నిర్వహించారట. ఈ సర్వే ప్రకారం చూసినట్లు అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలయ్యింది అన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొన్ని నియోజవర్గాలకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లు తెలుపుతున్నారు. కూటమిలో భాగంగా అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోనే ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తోంది. రెడ్ జోన్లో ఉన్న వారి లిస్టు ప్రకారం చూస్తే.. టిడిపి నుంచి 73 మంది, జనసేన పార్టీ నుంచి 12 మంది, బిజెపి నుంచి 7 మంది ఉన్నారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే 92 మంది పైన వ్యతిరేకత ప్రజలలో ఉన్నదన్నమాట.


జిల్లాల వారీగా విషయానికి వస్తే..
1). శ్రీకాకుళం:టిడిపి 4, జనసేన 1, బిజెపి 1
2). విజయనగరం:టిడిపి 5, జనసేన 1
3). విశాఖపట్నం:టిడిపి 3, జనసేన 2
4). ఈస్ట్ గోదావరి:టిడిపి 7, జనసేన 2, బిజెపి 1
5). వెస్ట్ గోదావరి:టీడీపీ 3, జనసేన 4
6). కృష్ణ:టిడిపి 6, బిజెపి 1
7). గుంటూరు: టిడిపి-9, జనసేన 1
8). ప్రకాశం-టిడిపి 5
9). నెల్లూరు: టిడిపి 5
10). కడప: టిడిపి 4, జనసేన 1, బిజెపి 1
11). కర్నూల్: టిడిపి 7, బిజెపి 1
12). అనంతపూర్: టిడిపి 8, బిజెపి 1
13). చిత్తూరు: టిడిపి 7, బిజెపి 1

మొత్తం మీద 175 నియోజవర్గాలకు టిడిపి పార్టీ నుంచి 73, జనసేన పార్టీ నుంచి 12, బిజెపి నుంచి 7 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ ఉన్నారు.

ఆరంజ్ జోన్: (పర్వాలేదన్న ఎమ్మెల్యేలు)
1). శ్రీకాకుళం:టిడిపి 3
2). విజయనగరం
3). విశాఖపట్నం:టిడిపి 3, జనసేన 2
4). ఈస్ట్ గోదావరి:టిడిపి 5, జనసేన 1
5). వెస్ట్ గోదావరి:టీడీపీ 2, జనసేన 2
6). కృష్ణ:టిడిపి 6,
7). గుంటూరు: టిడిపి-3
8). ప్రకాశం-టిడిపి 1
9). నెల్లూరు: టిడిపి 4
10). కడప:
11). కర్నూల్: టిడిపి 4
12). అనంతపూర్: టిడిపి 2
13). చిత్తూరు: టిడిపి 3

36 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 5 మంది జనసేన ఎమ్మెల్యేలు ఆరంజ్ జోన్ లో ఉన్నారు.


గ్రీన్ జోన్:
1). శ్రీకాకుళం:టిడిపి 1
2). విజయనగరం: టీడీపీ 3
3). విశాఖపట్నం:టిడిపి 1, బిజెపి 1
4). ఈస్ట్ గోదావరి:టిడిపి 2, జనసేన 1
5). వెస్ట్ గోదావరి:టీడీపీ 4
6). కృష్ణ:టిడిపి 1, జనసేన 1 బిజెపి 1
7). గుంటూరు: టిడిపి-5
8). ప్రకాశం-టిడిపి4
9). నెల్లూరు: టిడిపి1
10). కడప: టీడీపీ 1
11). కర్నూల్:
12). అనంతపూర్: టిడిపి 2
13). చిత్తూరు: టిడిపి 2

టిడిపిలో 27 మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్ లో ఉన్నారు, జనసేన పార్టీ 2, బిజెపి పార్టీ 2 స్థానాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.


ముఖ్యంగా ఇసుక మద్యం మీద వ్యతిరేకత, నిరుద్యోగ యువత వ్యతిరేకత, రైతులు ఆవేదన, అమరావతి విషయం పైన అసంతృప్తి చెందుతున్నారని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: