ఆ దేశాన్ని మోడీ దగ్గర చేసుకుంటారా...?

Gullapally Venkatesh
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని దేశాల విషయంలో చాలా వరకు సానుకూలంగానే ఉన్న మరికొన్ని దేశాల్లో విషయంలో కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు అనే భావన మీడియా వర్గాలు ముందు నుంచి కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ నిపుణులు కూడా ఈ విషయంలో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రష్యా సహా కొన్ని దేశాల విషయంలో మోడీ ఆసక్తిగా ఉండటం లేదు అని అంటూ ఉన్నారు. అమెరికాతో స్నేహం కోసం మాత్రమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు.
దీని వలన దేశం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని అన్నారు. రష్యాతో సన్నిహితంగా ఉండే దేశాలు భారత్ కు దూరంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రష్యా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలోచన మారవచ్చు అనే భావన కూడా ఉంది. వాస్తవానికి చైనా నుంచి భారత్ కు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. అందుకే ఇప్పుడు రష్యాను దగ్గర చేసుకోవడానికి ప్రధానమంత్రి మోడీ కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు.
వాస్తవానికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భిన్న వైఖరితో ముందుకు వెళుతూ ఉంటారు. అమెరికాతో సన్నిహితంగా ఉండే దేశాలతో కూడా సదరు అధ్యక్షుడు కాస్త స్నేహం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలతో కూడా ఆయన సన్నిహితంగానే ఉన్నారు. అయితే భారత విషయంలో కూడా ఆయన సన్నిహితంగానే ఉండాలని భావించినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆయన విషయంలో కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఆయనతో మోడీ ఒకసారి సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు మారడంతో కొన్ని పరిణామాలు మోడీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే రష్యా సహా కొన్ని దేశాలను దగ్గర చేసుకోవడానికి ప్రధాని ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: