మన ఎన్నారై వైద్యులకు చైనా గాలం...!
ఒకరకంగా చెప్పాలి అంటే వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాయి అని చెప్పుకునే అమెరికా యూరప్ దేశాలు కూడా ఇప్పుడు వైద్యుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా వ్యాధి అమెరికాలో తీవ్రంగా ఉన్న సమయంలో... చాలా మంది వైద్యుల కొరతతో ఆస్పత్రుల బయట ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. అందుకే ఇప్పుడు తమ దేశాల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి మన దేశ వైద్య నిపుణులకు అభివృద్ధి చెందిన దేశాలు గాలం వేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలు ఇతర దేశాల్లో ఉన్న వైద్యులను లాగే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే మన ఎన్నారై వైద్యులకు చాలా బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా చైనా అయితే మన వాళ్లకు భారీగా ఆఫర్లు ఇచ్చేస్తుంది. పరిశోధనలు చేసే ఎన్నారై శాస్త్రవేత్తలకు కూడా చైనా గాలం వేస్తుంది. వందల కోట్ల ఒప్పందాలు చేసుకోవడానికి రెడీ అవుతుంది. మన దేశం నుంచి వెళ్లి స్థిరపడిన వారికి పెద్ద పెద్ద పదవులను వైద్య రంగంలో ఇవ్వడానికి రెడీ అయింది. దీనితో అమెరికా నుంచి చాలా మంది ఎన్నారై వైద్యులు చైనా వెళ్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో కరోనా వ్యాక్సిన్ తయారీలో మన వాళ్ళు కీలకంగా ఉన్నారు.