చైనాతో  ట్రంప్ తెరచాటు ప్రేమాయణం..సంచలన నిజాలు వెల్లడించిన కీలక అధికారి...!!!

VIKRAM

కరోనా వైరస్ ని ప్రపంచం మీదకి వదిలింది చైనానే..చైనా ని విడిచి పెట్టేది లేదు..అది చేస్తా ఇది చేస్తా, పొడి చేస్తా , చైనా గుట్టు బయట పెట్టేస్తా అంటూ తొడలు కొట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు గుట్టు ఓ మాజీ కీలక అధికారి బయట పెట్టేశారు. అసలు ట్రంప్ నిజస్వరూపం ఇదేనంటూ ఓ పుస్తకాన్ని రాసేశారు. ఎవరో దారిన పోయే దానయ్య చెప్పాడంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు..కానీ ఈ భారీ రహస్యాన్ని చెప్పింది అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్.

జాన్ బోల్టన్ రాసిన “రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్” అనే పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు. 2019 లో జరిగిన జీ-20 సమావేశంలో వాణిజ్య చర్చలు జరిగిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్  తాను మళ్ళీ అధ్యక్షుడిగా రెండో సారి గెలవడానికి సాయం చేయాలని చైనాని కోరినట్టుగా రాసుకొచ్చారు. ట్రంప్ జిన్ పింగ్ మధ్య ఈ అంశం చర్చకి వచ్చిందని కుండబద్దలు కొట్టారు జాన్. తానూ గెలిస్తే చైనాకి మేలు జరుగుతుందంటూ జిన్ పింగ్ తో చెప్పారని తెలిపారు. 

జాన్ తన పుస్తక ఆవిష్కరణ సమయంలో ఈ సంచలన విషయాలని బయట పెట్టారు. ఈ ఏడాది నవంబర లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో మళ్ళీ సారి అధికారంలోకి రావడానికి ట్రంప్ ప్రత్యర్ధి దేశమైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ని సాయం అడగడాన్ని అమెరికా ప్రతిష్టని అగౌరవ పరచడమేనని అన్నారు. అసలు అమెరికాలో పాలన ఎలా సాగించాలి అనే విషయంపై ట్రంప్ కి ఇప్పటికి కూడా స్పష్టత లేదని అన్నారు. ఈ విషయంపై స్పందించిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ఇదే గనుకా వాస్తవం అయితే ట్రంప్ ని అమెరికా పౌరులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: