తెలుగులో బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఈ మద్య దూకుడు పెంచింది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఆ చాన్స్ కూడా కొట్టేసింది ఈ అమ్మడు. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నాగ్ కి మరదలుగా నటించినట్లు సమాచారం. ఇక అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లలో తన అందాలు ఆరబోస్తూ డ్యాన్స్ చేయడం చూస్తేనే ఉన్నాం.
ఆ మద్య దుబాయ్ లో జరిగిన ఫంక్షన్లో డ్యాన్స్ చేసి ప్రేక్షకుల మనసు దోచేసింది. తాజాగా సినీ‘మా’ అవా ర్డ్స్ 2015 వేడుక ఇటీవలే కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫంక్షన్లో సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు, సినీతారలు, అతిరథ మహారథులు విచ్చేసారు. సినిమా ఫంక్షన్లు అంటే ఎంట్రటైన్ మెంట్ విపరీతంగా ఉంటుంది. అందమైన భామలు వారి ఆటపాటలతో పిచ్చెక్కించేసారు. ఈ ఫంక్షన్లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది ఈ హాట్ యాంకర్ తన నడుమొంపులతో అక్కడున్న వారికి సెగలు పుట్టించింది.
హాట్ డ్యాన్స్ తో కేక పుట్టించిన అనసూయ
ఈ మద్య పలు ఈవెంట్స్, షో లలో చిందులేస్తూ స్పెషల్ సాంగ్ లలో నటించేందుకు సిద్ధమే అనే విధంగా అనసూయ తెగ హడావుడి చేస్తుంది. ఒకప్పుడు జబర్ధస్త్ షోలో చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొచ్చి తర్వాత సెక్సీగా చీరలు కట్టుకొచ్చి తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కించిన అనసూయ బయట జరిగే స్పెషల్ ఈవెంట్స్ లో తన వయ్యారాల నడుము వొంపులతో హాట్ గా కనిపించి అదరగొట్టేస్తుంది. తాజాగా ఈ అవార్డ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు విడుదల కావడంతో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ సృష్టిస్తున్నాయి.