కమలహాసన్ రజనీకాంత్ లపై ఇళయరాజా పగటికల !

Seetha Sailaja

1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి రికార్డులను క్రియేట్ చేసిన ఇళయరాజాకు మొన్న ముంబాయిలో జరిగిన సత్కార కార్యక్రమంలో ఇళయరాజాను కమల్, రజినీకాంత్, అమితాబ్ లు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంలో ఇళయరాజా రజినీకాంత్, కమలహాసన్ లపై చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు హీరో లక్షణాలుకన్నా దర్శకుడి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ఇళయరాజా.

ఇదే సందర్భంలో కమలహాసన్ గురించి మాట్లాడుతూ కమల్ నటుడిగా ఇప్పటికే ఎన్నో విలక్షణ పాత్రలలో నటించి మెప్పించినా గాయకుడిగా కమలహాసన్ ప్రయత్నించి ఉంటే దక్షిణాది సినిమా రంగానికి చాల మంచి గాయకుడు అయ్యేవాడని కమలహాసన్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసాడు ఇళయరాజా.

అమితాబ్, ధనుష్ లు కలిసి నటిస్తున్న హిందీ సినిమా ‘షమితాబ్’ సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఇళయరాజా ఈ వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇళయరాజా ఒక పాటను అమితాబ్ చేత పాడించాడు. ఇదే సందర్భంలో ఇళయరాజా కమల్, రజినీకాంత్ లపై తనకు ఉన్న ఒక పగటి కలను బయటకు చెప్పాడు.

కమలహాసన్ హీరోగా రజినీకాంత్ స్వయంగా స్క్రీన్ ప్లే రాసుకుని ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తే తనకు చూడాలని ఉందని అంటూ అటువంటి పగటి కల నెరవేరితే తాను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తాననీ ప్రకటించాడు ఇళయరాజా. సంగీత దర్శకుడిగా ఎన్నో ప్రయోగాలను చేసిన ఇళయరాజా కమల్, రజినీకాంత్ లపై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా అటువంటి కామెంట్స్ చేయగల సత్తా ఒక్క ఇళయరాజాకు మాత్రమే సొంతం అంటూ కామెంట్స్ వినిపించాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: