బేరాలు ఆడుతున్న బిగ్ బాస్ కంటిస్టెంట్స్....!

Sirini Sita

ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట "బిగ్ బాస్"అందులో ఉన్న కంటెస్టెంట్స్ పేర్లు వాళ్ళ ఆట తీరు ఆ రేంజ్ లో ఫైనల్‌కి దగ్గర పడుతూ ఇంకా ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలి వుండడంతో ఫైనల్‌లో చోటు దక్కదనే ఉత్కంఠ హౌస్‌లో వున్న అందరిలోను నెలకొంది. శ్రీముఖి, రాహుల్‌, వరుణ్‌ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ వుండగా, మిగిలిన నలుగురిలో ప్రతి ఒక్కరూ 'ఈవారం నేనేనేమో' అన్నట్టుగా వున్నారు. ఇలాంటి టైమ్‌లో ర్యాంకింగ్‌ టాస్క్‌ ఇచ్చి... మొదటి మూడు ర్యాంక్‌లలో వున్న వాళ్లు నామినేట్‌ అవరు అని బిగ్‌బాస్‌ చెప్పేసరికి, ఆ ర్యాంకుల కోసం మొదలైన బేరసారాలు చినికి చినికి గాలివానగా మారాయి.ఇప్పుడు ఆ విషయం ఒక పెద్ద సమస్య గా మారిపోయింది.

రాహుల్‌కి దక్కిన సెకండ్‌ ర్యాంక్‌ తనకి ఇమ్మని ఏడవ స్థానంలో వున్న శ్రీముఖి అడగగా, అతను కుదరదని చెప్పాడు దాంతో అతడిని బ్రతిమిలాడలేక మానేసి శ్రీముఖి ఎప్పటిలా వాదనకి దిగి తన బలహీనత బయటపెట్టుకుంది. ఆ తర్వాత అలీ రెజా కూల్‌గా అడిగినపుడు రాహుల్‌ అతనికి తన ప్లేస్‌ ఇచ్చేసాడు. అయితే మూడవ స్థానం కోసం పెద్ద రచ్చే జరిగింది. ముందుగా అక్కడ వరుణ్‌ సందేశ్‌ వుంటే మాట్లాడుకుని వదిలేసిన శివజ్యోతి అదే స్థానాన్ని అతను వితికకి ఇచ్చేసరికి వాదనకి దిగింది. తనకెలా ఇచ్చేస్తావ్‌ అంటూ శివజ్యోతి అదే పనిగా వాదించడంతో వరుణ్‌ సందేశ్‌ తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయాడు. 

శివజ్యోతిని వెక్కిరిస్తూ కొన్ని వెకిలి చేష్టలు చేసి తన ఇమేజ్‌ని మరోసారి భార్య కోసం డ్యామేజ్‌ చేసుకున్నాడు. ఈ వాదనలో మూడవ స్థానంనుంచి కదిలేది లేదంటూ శివజ్యోతి బైటాయించడంతో బిగ్‌బాస్‌ అందరినీ నామినేట్‌ చేసేసాడు. హౌస్‌లో వున్న అందరూ నామినేట్‌ అవడంతో అందరికంటే తక్కువ ఫాలోయింగ్‌ వున్న వ్యక్తి ఔట్‌ అయ్యే అవకాశాలు పెరిగాయి కనుక ఇంతకాలం భర్త చాటు దాగిన వితిక ఎలిమినేట్‌ అవడానికి స్కోప్‌ ఎక్కువ వుందని అంటున్నారు.పాపం ఆమె అసలే డబ్బొస్తే తన కుటుంబ కష్టాలు తీర్చుకోవాలి అంటూ పెద్ద స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది ఇప్పుడు ఎలిమినేట్ అయితే ఏంట్రా నా పరిస్థితి అని తీవ్ర ఆందోళనలో పడింది ఈ అమ్మడు.మిగతావారు కూడా బిక్కు బిక్కు మంటూ హౌస్ లో గడిపేస్తున్నారంట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: