ఆకట్టుకుంటున్న సమంత లుక్
ఇక ఇటీవల ఓబేబి తో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది సమంత. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది. అయితే ఈ చిత్రం తరువాత సమంత ఇంతవరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. దాంతో సమంత త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే ఊహాగానాలు వెలుబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల పడి పడి లేచె మనసు , రణరంగం రూపంలో డిజాస్టర్ లను చవిచూసిన శర్వానంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం శర్వా ,96 రీమేక్ తో పాటు శ్రీకారం అనే చిత్రంలో నటిస్తుండగా ఇటీవలే తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.