ఏడాది తర్వాత చూసినా గర్వపడుతున్నా.. కంచరపాలెంపై జగపతి బాబు కామెంట్స్ ..!

shami
ఈమధ్య తెలుగు సినిమాల్లో చాలా పెద్ద మార్పులే వచ్చాయి. కథను నమ్మే సినిమాలు కొన్నైతే కమర్షియాలిటీని నమ్మే సినిమాలు కొన్ని వస్తున్నాయి. ఇదిలాఉంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 7న రిలీజైన ఓ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమానే కేరాఫ్ కంచరపాలెం. 


వెంకటేష్ మహా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి సమర్పించారు. రిలీజైన టైంలో సినిమా చూసిన అందరు ఆహా ఓహో అన్నారు. కమర్షియల్ గా కూడా సినిమాకు మంచి లాభాలే వచ్చాయి. ఆ సినిమా తర్వాత వెంకటేష్ మహా ప్రతిభ అందరికి తెలిసింది.


ప్రస్తుతం అతను తన రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలాఉంటే ఈ సినిమాను ఏడాది తర్వాత చూసిన హీరో కమ్ విలన్ జగపతి బాబు సినిమా దర్శకుడిపై ప్రశంసలు కురిపించాడు. రీసెంట్ గా కేరాఫ్ కంచెరపాలెం సినిమా చూశాను.. ఆలస్యమే అయినా గర్వంగా చెబుతున్నా.. సినిమాలో ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. దర్శకుడికి, నటీనటులకు తన అభినందనలు అంటూ మెసేజ్ పెట్టారు జగపతి బాబు. 


అంతేకాదు చివరగా దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నా అని మెసేజ్ పెట్టారు జగపతి బాబు. సినిమా వన్ ఇయర్ తర్వాత చూసినా ఇప్పుడు రెస్పాండ్ అయ్యి ఏం లాభం లే అనుకుకోకుండా దర్శకుడి ప్రతిభని మెచ్చుకున్న జగపతి బాబుకి ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక ఆయన డైరక్షన్ లో అవకాశం వస్తే చేస్తా అన్నందుకు కూడా ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. మనసుకి నచ్చిన సినిమా గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేయడం గొప్ప విషయం. అలా చేయడం వల్ల ఆ సినిమా మిస్సైన వారు కూడా జగపతి బాబు చెప్పడం వల్ల సినిమా చూసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ సినిమా దర్శకుడి ప్రతిభ వారికి తెలిసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.   
 


Though it is late, with pride I like to mention that I just saw #CareOfKancharapalem movie and I loved every moment of the film...my respect and regard to the director and the actors, and I must confess I am looking forward to work with @venkateshmaha25. pic.twitter.com/W3SKL1N2e1

— Jaggu Bhai (@IamJagguBhai) September 14, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: