అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ బాలీవుడ్లో మాత్రం అదిరిపోయే రీతిలో రికార్డు కలెక్షన్లు సాధించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు నటించడంతో నార్త్ ఇండియన్ సినిమా ప్రేమికులు 'సాహో' సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉండటంతో నార్త్ ఇండియా ఆడియన్స్ కి సినిమాలో ఉన్న సన్నివేశాలు అదిరిపోయే రీతిలో ఆకట్టుకుంటున్నాయి.
350 కోట్ల తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో హాలీవుడ్ మూవీస్ ను తలదన్నేలా రూపొందిన 'సాహో' మూవీ 2వారాలకు ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన సాహో, చిచ్చో రే మూవీస్ వారం రోజుల గ్యాప్ లో రిలీజయి ఘనవిజయం సాధించడం విశేషం. ఒక సౌత్ ఇండస్ట్రీ లో తప్ప నార్త్ లో మొత్తానికి సాహో అదిరిపోయే రీతిలో కలెక్షన్లు సాధించింది.