సెన్సేషనల్ : బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి కి ‘ఐ లవ్ యు’ చెప్పేశాడు..!
దీంతో కొంత సేపు జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్ బాబా భాస్కర్ శ్రీముఖి ల మధ్య కామెడీ అద్భుతంగా పండింది. ఇటువంటి నేపథ్యంలో ఇంటిలోని సభ్యులకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ షాక్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న సభ్యుల కోసం బయట ఉన్న ఇంటి సభ్యులు పంపిన సందేశాలను బిగ్ బాస్ లోని సభ్యులకు అందించారు. దీంతో ఇంటి లోని సభ్యులంతా వాటిని చదువుకొని ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి పడుకునే ముందు వరుణ్, వితికా, రాహుల్, పునర్నవిల మధ్య ఒక టాపిక్ నడిచింది. ముందు వితికా.. రాహుల్ ని 'నీకు నిజంగా పునర్నవి మీద ఫీలింగ్స్ లేవా..?' అని ప్రశ్నించింది.
దానికి రాహుల్ సమాధానమిస్తూ పునర్నవి అంటే జస్ట్ ఇష్టమని మరో ఉద్దేశం లేదని తేల్చిచెప్పేశాడు. నిజంగా నాకు అటువంటి ఫీలింగ్ ఉంటే కచ్చితంగా డేర్ గా ప్రపోజ్ చేయడం ఖాయమని తెలిపాడు. ఇదే ప్రశ్న పునర్నవి ని ప్రశ్నించగా...తనకు రాహుల్ అంటే ఇష్టమే కానీ తనకి ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్పుకొచ్చింది. ఇంతలో కామెడీగా రాహుల్...ఐ లవ్ యు పునర్నవి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో వరుణ్ సందేశ్ కావాలని పూసగుచ్చినట్లు గుచ్చి గుచ్చి పునర్నవి నీ అడగటంతో...ఆల్రెడీ మేమిద్దరం లవ్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది పునర్నవి.