సినిమాల వైపు అడుగులేసిన బుల్లితెర యాంకర్లు.. ఎవరంటే?

satvika
తమలోని టాలెంట్ ను బయటపెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. అలా కాలేజిలని, బయట షోస్ అని ఏవి పడితే అవి చేసుకుంటూ పోతారు. కొందమంది ఈజీగా తమ టాలెంట్ బయటపెట్టేసి, యాంకర్లుగా మరియు సెలెబ్రెటీలుగా చలామణి అవుతుంటారు. సరేలెండి.. టాలెంట్ ఎవడి అబ్బా సొత్తుకాదు అంటారుగా అలా ఎవరిది వారికుంటుంది. ఇకపోతే హాట్ షోలు, హాట్ డ్రెస్సులు, హాట్ మాటలతో ముంచేసేది మాత్రం ఒక్క యాంకరే. షో కి అందం రావాలంటే యాంకర్ అందంగా ఉండాలంటారు. అది నిజమే. కేవలం అందం ఉంటె సరిపోదు. మంచిగా అల్లుకుపోయే తత్త్వం కూడా పుష్కలంగా ఉండాలి. 

బుల్లితెరపై యాంకర్లుగా చాలా మంది తమ హవాను కొనసాగిస్తుంటారు. అలా బాగా పాపులర్ అయ్యి సినిమాలలోకి వెళ్లిన యాంకర్లు చాలా మందే ఉన్నారు.. వారెవాంరంటే.. యాంకర్ అన్న పదం వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ.. ఆమెను ఇండస్ట్రీలో అందరు ముద్దుగా పిలుచుకునే పేరు సుమక్క. మొదటగా సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఈ కేరళ కుట్టి. ఆ తరువాత యాంకరుగా సెటిల్ అయింది. ఇకపోతే అప్పుడప్పుడు సినిమాలలో తళుక్కుమంది కూడాను. సుమ తర్వాత గుర్తొచ్చే పేరు ఉదయభాను.. ఈ బ్యూటీ యాంకరుగా ఎంత పేరు తెచ్చుకుందో.. అంత హాట్ గాళ్ గా కూడా బాగా పేరు సంపాదించింది. కొన్ని సినిమాలలో కూడా మెరిసింది. 

ఝాన్సీ.. ఈమె వ్యక్తగా మంచి పేరును, పాపులారిటీని సంపాదించుకుంది. అయితే, ఒకప్పుడు కామెడీ పాత్రల్లో అలరించిన ఈమె, ఎప్పుడు ఏకంగా సినిమాకు బ్యాక్ బోన్ పాత్రల్లో నటిస్తుంది. శ్రీముఖి.. అదుర్స్ షో ద్వారా బాగా పాపులర్ అయినా ముద్దుగుమ్మ శ్రీముఖి. యాంకర్గా చాలా ఫెమస్ అయింది దానితో, సినిమాల వైపు వెళ్లి మరి అందరి దృష్టిని లాగేసుకుంటుంది. అనసూయ.. రంగమ్మత్త అంటే ఎవరు మర్చిపోతారు. పేరును, ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటూ పోయి, ప్రస్తుతం సినిమాలు, యాంకర్గా కొనసాగిస్తుంది. 

రష్మీ.. హాట్ యాంకర్, హాట్ యాక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మీ. వచ్చిరాని తెలుగుతో , వయలొలికించే వయ్యారాలతో, కైపెక్కించే ఈ భామ తన పదహారోవా ఏటా సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకరుగా పేరు తెచ్చుకున్న ఈమె అటు సినిమాలు, ఇటు షో లతో బిజీగా ఉంది. శ్యామల.. తెలుగింటి ఆడపడుచు అంటే ఈవిడే శ్యామల. సినిమాలలో ను, యాంకరుగా మంచి తెచ్చుకుంది. ఇది యాంకర్స్ సినీ విశేషాలు. బుల్లితెర నుండి, వెండి తెరకు పరుగులు తీస్తున్న ముద్దుగుమ్మలు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: