సీక్రెట్ గా సాహో సెన్సార్ ముంబాయ్ లోనే ఎందుకు జరుగుతుంది...?

Kunchala Govind
యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్..బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో. 350 కోట్ల బడ్జెట్ తో దాదాపు సౌత్ లో ఉన్న అన్నీ భాషల్లో గ్రాండ్ గా ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న విషయం అందరిని ఎంతో ఆతృతకు గురి చేస్తోంది. ప్రమోషన్ లతో జోరుమీదున్న సాహో బృందం నుండి సీక్రెట్ గా జరుగుతున్న వ్యవహారం ఒకటి బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతుందో తెలీదుగాని సాహో సెన్సార్ కార్యక్రమాలు అయిపోయాయా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చాలా సైలెంట్ గా ముంబాయిలో అన్ని భాషల వెర్షన్లు కలిసి ఒకేసారి సెన్సారు చేయించారన్న వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి. 

ఇక సెన్సార్ విషయంలో ఇక్కడికి ముంబాయికి తేడా ఏమిటంటే, మనదగ్గర ఇలా చూసి, అలా చెప్పేస్తారు ఏ సర్టిఫికెట్ ఇస్తారో. అలాగే పనిలో పనిగా ఎ కాకుండా యు/ఎ కావాలంటే ఏ మేరకు సినిమాలో సీన్స్ తీసేయాలో సూచిస్తారు. ఇలాగే కట్ ల గురించి కాస్త డిస్కషన్ వుంటుంది. కానీ ముంబాయిలో అలా కాదు. ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చెప్పడానికి కాస్త టైమ్ తీసుకుంటారు. అప్పుడు డిస్కషన్లు వుంటాయి. ఇప్పుడు సాహో అదే పరిస్థితులో వుందని లేటెస్ట్ న్యూస్. సాహోకు యు/ఎ సర్టిఫికెట్ అవసరం. ఎ సర్టిఫికెట్ వస్తే ఇబ్బంది అవుతుంది. అయితే ఎ సర్టిఫికెట్ వచ్చేంత వయిలెన్స్, అడల్ట్ సీన్లు అయితే సినిమాలో వుండే అవకాశం లేదని ఇప్పటికే అర్థమైపోయింది. అందువల్ల యు/ఎ సర్టిఫికెటే వచ్చే అవకాశం వుంది. అయితే కొన్ని  కట్స్ మాత్రం పడొచ్చని తెలుస్తోంది.

ఇక సాహో రన్ టైం రెండు గంటల యాభై రెండు నిమిషాలు వుంటుందని తెలుస్తోంది. ఇందులోంచి స్మోకింగ్ యాడ్స్ టైమ్ తీసేయాలి. మొత్తానికే ఈ రోజు, రేపట్లో సాహో సెన్సారు సర్టిఫికెట్ కు సంబంధించిన వార్త బయటకు రాబోతుందని తెలుస్తోంది.  ఇక ఈ సినిమా తో మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో ప్రపంచ మొత్తం తెలియడానికే ఓ వారం రోజులు మాత్రమే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: