షాక్‌: కౌంటింగ్ అవ్వ‌లేదు... వైసీపీ ట‌చ్‌లో జ‌న‌సేన, బీజేపీ అభ్య‌ర్థులు..?

RAMAKRISHNA S.S.
- ఎవ‌రి ప్ర‌భుత్వం వ‌స్తుందో అంచ‌నాలేసుకుంటోన్న అభ్య‌ర్థులు
- వైసీపీ ట‌చ్‌లో తిరుప‌తి జ‌న‌సేన అభ్య‌ర్థి అర‌ణి శ్రీనివాసులు ?
- పెద్దిరెడ్డిపై తిరుప‌తి బీజేపీ ఎంపీ క్యాండెట్ ప్ర‌శంస‌లు
( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. సోమ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్‌లో భారీ ఎత్తున ప్ర‌జ‌లు పోటెత్తి మ‌రీ ఓటేశారు. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పోలింగ్ న‌మోదైంది. దీంతో ఫ‌లితంపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది. 70 -75 శాతం మ‌ధ్య పోలింగ్ న‌మోదై ఉంటే.. అది కూట‌మికి ప్ల‌స్ అని చెప్పుకొనే అవ‌కాశం ఉండేది. కానీ, 80 శాతం దాటిన ద‌రిమిలా.. ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యంపై సందేహాలు ముసురుకున్నాయి. స‌రే.. ఈ ఫలితం ఏంట‌నేది జూన్ 4న తేలిపోతుంది.

ఇదిలావుంటే.. పార్టీల‌కు ఇప్పుడు అభ్య‌ర్థుల ప‌రేషాన్ ప‌ట్టుకుంది. ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా.. అభ్య ర్థుల విష‌యంలో పార్టీల‌కు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీ నేతృత్వంలోని కూట‌మి గెలిస్తే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. వైసీపీ నుంచి గెలిచిన వారిలో స‌గం మంది వ‌ర‌కు.. ఆ పార్టీలోకి జంప్ చేసే అవ‌కాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే కొంద‌రు ఆయా ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. త‌మ‌పై కేసులు పెడ‌తార‌నే భ‌యం వైసీపీ నేత‌ల‌ను వెంటాడుతోంది.

దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చాలా లోతుగా ఫ‌లితంపై అంచనాలు వేసుకుంటున్నారు. ఇదేస‌మ‌యం లో వైసీపీ గెలిచినా.. ఇదే పరిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ వ‌చ్చినా.. త‌మ‌పై కేసులు పెట్టి వేధిస్తార‌ని కొందరు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి వారు కూడా.. వైసీపీకి ట‌చ్‌లో ఉన్నారు. అందుకే.. ప‌లితంపై ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. పైగా మౌనంగా ఉంటున్నారు. ఈ ప‌రిణామాలు ఇటు టీడీపీ, అటు వైసీపీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి నుంచి బ‌రిలో ఉన్న ఆర‌ణి శ్రీనివాసులు.. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లతో ట‌చ్‌లో ఉన్నార‌న్న ప్ర‌చారం న‌డుస్తోంది. తిరుప‌తి పార్ల‌మెంటు నుంచి బ‌రిలో ఉన్న వ‌ర‌ప్ర‌సాద్.. తాజాగా అన‌ధికారికంగా పెద్దిరెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు. అదేవిధంగా ప‌లువురు నాయ‌కులు కూడా ఇదే ప‌నిలో ఉన్నారు. ఇక‌, వైసీపీ నుంచి పోటీ చేసిన వారు కూడా.. కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు ట‌చ్‌లో ఉన్నారు. ఇలా.. ప‌దుల సంఖ్య‌లో జూన్ 4 త‌ర్వాత‌.. ఏం జ‌రిగినా.. త‌మ త‌మ రాజ‌కీయ భ‌వితవ్యాన్ని సేఫ్ ప్లేస్లో చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఎక్క‌డా ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌డం లేదు. ఎవ‌రినీ విమ‌ర్శించ‌డ‌మూ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: