హిందూపురంలో ఆ సామాజికవర్గం ఏకమైందా... బాలయ్యకు గెలుపు కష్టమేనా?

Reddy P Rajasekhar
ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకు భారీ షాక్ తప్పదా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నియోజకవర్గంలో బీసీలు అంతా ఏకమై దీపికకు అనుకూలంగా ఓటు వేశారని అందువల్ల సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా హిందూపురంలో బాలయ్యకు గెలుపు అయితే సులువు కాదని తెలుస్తోంది. హిందూపురం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
బాలయ్య నాన్ లోకల్ కావడం, ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉండటంతో హిందూపురం ప్రజలు ఈ ఎన్నికల్లో దీపికనే గెలిపించుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో దీపిక గెలిస్తే మాత్రం సంచలనం అవుతుందని చెప్పవచ్చు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఈ కంచుకోటను బ్రేక్ చేయాలని జగన్ భావిస్తున్నారు.
 
ఒకప్పుడు జగన్ బాలయ్యకు వీరాభిమాని అయినా ఇప్పుడు మాత్రం బాలయ్యను జగన్ ప్రత్యర్థిలానే చూస్తారు. 2024 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబోతున్నారని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు సైతం ఈ ఎన్నికల్లో విజయం విషయంలో గతంతో పోల్చి చూస్తే కాన్ఫిడెన్స్ తగ్గిందని సమాచారం అందుతోంది.
 
బాలయ్య పూర్తిస్థాయి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సందర్భాలు తక్కువని బాలయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించినా ఆయన సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాజకీయాలకు ఇవ్వరని విమర్శలు ఉన్నాయి. బాలయ్య హిందూపురంను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశానని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందే అనుకూల పరిస్థితులు లేవని బాలయ్య అప్పట్లో ఎమ్మెల్యేగా గెలవడానికి యాగం చేయించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సైతం బాలయ్య గెలుపు కోసం ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారేమో తెలియాల్సి ఉంది. హిందూపురం ప్రజలు మార్పు కోరుకుంటే మాత్రం బాలయ్య శాశ్వతంగా రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: