ఆ తప్పిదంతోనే.. ప్లే ఆఫ్స్ చేరలేకపోయాం : గైక్వాడ్

praveen
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఎందుకంటే తప్పకుండా ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది అనుకున్న సీఎస్కే టీం ఇటీవలే బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి చివరికి ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. చెన్నై కొత్త కెప్టెన్ ఋతురాజ్ టైటిల్ గెలిచి ధోనీకి బహుమతిగా ఇస్తాడని అందరూ అనుకున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే సీఎస్కే ప్రస్థానం కూడా కొనసాగింది.

 కాగా ఇక చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అటు rcb గెలిచిన కొన్ని సమీకరణలు ఉండడంతో.. ఆ సమీకరణల ద్వారా గెలవకపోతే చెన్నైకి ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బెంగళూరు జట్టు తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించలేకపోయినా చెన్నై జట్టు చివరికి ఓడిపోయింది  ఇక సమీకరణాలన్నింటినీ కూడా చేరుకోవడంలో సక్సెస్ అయిన ఆర్సిబి అనూహ్యంగా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. దీంతో ధోని అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ అనంతరం ఋతురాజు గైక్వాడ్ ప్లే ఆఫ్ చేరకపోవడం నిరాశకు గురిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ చాలా బాగుంది. బంతి టర్ను అవడంతో పాటు కొంచెం ఆగుతూ వచ్చింది. అయినా ఈ వికెట్పై 200 పరుగులు చేదన అనేది పెద్ద కష్టమేమీ కాదు. కానీ మేం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. కొన్ని కొన్ని సార్లు టి20 క్రికెట్లో ఇలాగే జరుగుతుంది. ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన సంతోషాన్ని ఇచ్చింది. 14 మ్యాచ్ ల్లో ఏడు విజయాలు సాధించామంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: