రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ లో వర్గాలు సహజం. ఓ వర్గానికి సీఎం పదవి ఇస్తే.. ఆ పదవికి పోటీ పడే వర్గానికి పార్టీ బాధ్యతలను అప్పజెప్తుంది. తద్వారా  అతనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా అడ్డుకుంటుంది. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోను అదే జరిగింది. కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్నారు. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న సమయంలోను  సచిన్ ఫైలెట్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.

మరి రేవంత్ విషయంలో ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానానికి వీర విధేయుడిగా మారారు. మరి ఆయన విషయంలో పక్కలో బల్లెంలా ఉండే వ్యక్తిని పీసీసీ చీఫ్ ని చేస్తుందా లేదా ఆయన సూచించిన వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పజెప్తుందా అనేది చూడాలి. ఈ లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లలో విజయం సాధిస్తే రేవంత్ కు తిరుగుండదు. ఆయన చెప్పిన వారికే పీసీసీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాని పక్షంలో ఆయన అధికారానికి అడ్డు తగిలే వారు క్రమంగా పెరుగుతూ ఉంటారు. పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి..సీఎం రేవంత్ స్వేచ్ఛకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: