అదిరిపోయే డైరెక్టర్ తో సూర్య లేటెస్ట్ మూవీ..!
ఈ సినిమాకి సంబంధించిన వార్త ఇటీవల అధికారికంగా కోలీవుడ్లో కూడా వెల్లడయ్యింది. వివరాల ప్రకారం విశ్వాసం చిత్రానికి సంగీతం అందించిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందించబోతున్నాడు. వెట్రి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. మిలాన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. శివ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రకటన చేసింది.
శివ ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో రూపొందించబోతున్నాడు.. హీరోయిన్ ఎవరు తదితర అంశాలన్నీ త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం సూర్య కప్పాన్ అనే సినిమా చేస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ సినిమా గా రూపొందుతోంది. ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయటానికి వాయిదా వేశారు.