పోలీసులకు బుక్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..?
ఈ క్రమంలో సైలెంట్ గా బండి మీద వెళ్లే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ పోలీసులకు కెలికాడు. ట్విట్టర్ లో హైదరాబాద్ పోలీసుల ఉద్దేశించి...హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్ లో బైక్ పై వెళుతున్నాం.. పోలీసులు ఎక్కడ.. బహుశా థియేటర్ లోపల ఉన్నారనుకుంటా అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.
దీంతో వర్మ సెటైర్లకు పోలీసులు జరిమానాతో సమాధానం ఇచ్చారు వర్మ ప్రయాణించిన బైక్ నెంబర్ గుర్తించి హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్ వెళ్లినందుకు 1300 రూపాయలు జరిమానా విధించారు. వర్మ ప్రయాణించిన బైక్ నెంబర్ టీఎస్ 07 జీపీ 2552కు జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.